చోరీ కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులు సిబ్బంది 

police-staff-caught-the-defendant-in-the-theft-case 

చోరీ కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులు సిబ్బంది 

సిటీ పోలీస్ కమీషనర్ డా.శంకాబ్రత భాగ్జి పోలీస్ సిబ్బందికి అభినందనలు

 

IMG-20250217-WA0324 విశాఖ క్రైమ్ బ్యూరో, పెన్ పవర్, ఫిబ్రవరి 17 :

ఆరిలోవ ఆదర్శనగర్ దగ్గరలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ వద్ద వున్నా రెండు ఇండ్లలో దొం గతనాలు జరిగిన జరిగినాయని 112 కాల్స్ రాగా, సదరు నేర స్థలం వద్దకు ద్వారక క్లైమ్స్ సి.ఐ  ఆరిలోవ క్రైమ్ ఎస్.ఐ. వారి సిబ్బందితో పాటుచేరుకొని, పరిశీలించగా మొదటిగా రాజీ వ్ నగర్ కాలనీలో సాయిబాబా గుడి పక్కన ఉన్నటువంటి ఇంట్లో దొంగతనం జరగా అందు లో సుమారు మూడు తులాల బంగారు వస్తు వులు పోయినట్లు, మరియు హైవే కి అనుకొని ఉన్నటువంటి రెండవ గృహంలో 28 తులాల బంగారం, కేజీ వెండి, ఒక లక్ష రూపాయలు నగదు పోయినట్లు రెండు రిపోర్టులు తీసుకొని రెండు కేసులు నమోదు చేయడమైనది.సదరు పై నమోదు చేసిన కేసుల్లో డీసీపీ క్లైమ్స్ మేడం గారి ఆదేశాల మేరకు ఎడిసిపి క్రైమ్స్, ఏసిపి క్లైమ్స్ వారు సూచనలు ఆధారంగా ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్స్ సీ.ఐ వి. చక్రధర్ రావు ఆరిలోవ క్రైమ్ ఎస్.ఐ హరికృష్ణ వారి సిబ్బంది మరియు సి.సి.ఎస్ సి.ఐ.లు రామారావు, ఎర్రం నాయుడు, శంకర్ నారాయణ,సి.సి.ఎస్ సిబ్బంది మరియు జోన్ 1 క్రైమ్ సిబ్బంది బృందాలుగా విడిపడి గాలింపు చేపట్టినారు.
ముద్దాయి రెండో నేర స్థలం నుంచి బయటికి వచ్చిన సిసి పుటేజ్ ఆధారంగా విశాఖపట్నం కమిషనరేట్ లో ఉన్నటువంటి కమాండ్ కం ట్రోల్లో ఉన్నటువంటి సిసి పుటేజ్ ను ముద్దాయి తిరుగు ప్రయాణం పరిశీలించగా ముద్దాయి తిరుగు ప్రయాణంలో ఏపీ 31 బిపి  2435 స్కూటీ ని ఉపయోగించి మల్కాపురం వరకు వెళ్లినట్లు తెలిసినది.సదరు బండి నెంబర్ ఆధా రంగా నేరం చేసినది పాత నేరస్తుడు అయినటు వంటి నూనెల కృష్ణ చెవిటి కృష్ణగా గుర్తించి సదర్ క్రైమ్ బృందాలన్నీ మల్కాపురం ఏరియా ని జల్లెడ పట్టగా నిన్న అనగా తేదీ ఫిబ్రవరి 16 సాయంత్రం సుమారు 6 :30 గంటల సమయం లో మల్కాపురం ఆంజనేయస్వామి గుడి దగ్గర లో సదరు ముద్దాయి నూనెల కృష్ణ తన నేరం చేయుటకు ఉపయోగించినటువంటి స్కూటీ పై ద్వారకా క్లైమ్స్ ఆరిలోవ క్రైమ్ ఎస్సై మరియు వారి సిబ్బందిని చూసి పారిపోతుండగా పోలీ సు వారు ముద్దాయిని పట్టుకొని అతని అదు పులోకి తీసుకొని అతను అదీనంలో ఉన్నటు వంటి రెండు నేరాలకు సంబంధించినటువంటి 32 తులాల బంగారు ఆభరణాలు, ఒక కేజీ వెండి, రూ. 73000/- నగదు దీనితో పాటుగా నేరానికి ఉపయోగించినటువంటి హోండా యాక్టివా స్కూటీ ముద్దాయి ఒక సెల్ ఫోన్, నేరం నకు ఉపయోగించిన వస్తువులు కూడా తదుపరి దర్యాప్తు నిమిత్తం జప్తు చేయడం అయినది. సదరు ముద్దాయి నూనెల కృష్ణ పై సుమారు 20 కేసులు ఇంతకు ముందు నమో దు ఉన్నాయి ఇతను చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చి ఉన్నాడు ఇతనిపై మల్కాపురంలో బీసీ సీట్ కూడా ఉన్నది.
ఈ కేసును ఛేదించడం లో అద్భుతంగా పని చేసిన పోలీసు అధికారులను మరియు సిబ్బం దిని విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ శంకాబ్రత భాగ్జి అభినందించారు.

About The Author

SOMA RAJU Picture

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.