రాజు గాడి కథల చిట్టా ఎపిసోడ్‌ -2 

రాజు గాడి కథల చిట్టా ఎపిసోడ్‌ -2 

మీరు ఏం మతం వారైనా... నో ప్రాబ్లం హిందూ మ్యారేజ్‌ చేసుకోవచ్చు... ఇది రాజుగాడి లెక్క
    బయటెందుకు బొక్క...ఏ డేటా ఏంట్రీ అయిన సబ్‌ రిజిష్ట్రారు ఆఫీస్‌ లోనే చేసేస్తాం
    జనరల్‌గా మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌కు ఐదు వందలు, ఇక్కడ మ్యారేజ్‌ రిజస్ట్రేషన్‌ కు ఐదువేలు 
    అవునండి ఇది రాజుగాడి లెక్క ప్రకారం మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే సల్మాకు ఐదువేలు సమర్పించాల్సిందే..?
    దస్తావేజులు సబ్‌ రిజిష్ట్రారు చెక్‌ చేయటం పూర్తి అయిన తర్వాత పేజీలు మార్చటం రాజుగాడికి వెన్నతో పెట్టిన విధ్య
    రాజుగాడి లెక్క ప్రకారం నికర ఆదాయం రోజుకు తక్కువలో తక్కువ మినిమం పదివేలు.. మ్యాగ్జిమమ్‌ ఒక లక్షరూపాయలు
    రాజుగాడి ఆదాయం కోట్లలోనే..? మరి ఐ.టి పరిధిలోకి రారా..? రారండి ఇది సక్రమ సంపాదన కాదు, అక్రమ సంపాదన..!
    

రాజు గాడి కథల చిట్టా ఎపిసోడ్‌ `2 కోసం నిన్నటి నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న పెన్‌ పవర్‌ పాఠకులకు శుభోదయం... అసలు మన రాజుగాడి లెక్కేవేరు..ఈ పన్నెండు సంవత్సరాలలో తాడేపల్లిగూడెం సబ్‌ రిజిష్ట్రారు ఆఫీసు సాక్షిగా బొక్కింది ఎంతో తెలుసా... మనకున్న విశ్వాసనీయ సమాచారం ప్రకారం కోట్లలోనే అంటా..?  ఇందులో పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు లేండి...రాజుగాడి కి ఇన్ఫర్‌మేషన్‌ కోసం ఓ రెండు ప్రోపార్టీలు మన పాఠకుల కోసం అందించాలని నిర్ణయం తీసుకున్నాం... ప్రాపర్టీ నెం.1. ఉంగుటూరులో ఒక ఇండివిడ్యువల్‌ ఇల్లు... అందులో వాడే ఇంటికి కావాల్సిన వర్క్‌ అంతా ప్యాలెస్‌ ను తలపిస్తుందంటే... అయ్యవారు పరిస్ధితి ఏమిటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ప్రాపర్టీ నెం.2. తాడేపల్లిగూడెంలో సెంటర్‌ లో సొంతంగా ఓ షాపు కొని(ఎంతకు కొన్నారో మన రాజుగాడికి తెలుసులేండి) ఓ ఇద్దర్ని పెట్టి వ్యాపారం నడుపుతున్నాడంటే, ఆహా ఆ ఠీవి ఎవరికి వస్తుంది... ఇక వివరాల్లోకి వెళితే తాడేపల్లిగూడెం సబ్‌ రిజిష్ట్రారు ఆఫీసులో  మన రాజుగాడికి సెపరేటు ఒక క్యాబిన్‌ ఉంటుందంటే ఇక ఆ ఠీవి చూసి ఆఫీసులోకి అడుగు పెట్టిన వారికి ఎవరికైనా... వీడు ప్రభుత్వ ఉద్యోగి గానే కనిపిస్తాడు వాడు కూడా ఆ స్టైల్‌ లోనే కలరింగ్‌ ఇస్తాడు. 

మరిన్ని వివరాలు :epaperpenpower.in 08-08-2024 చూడండి

About The Author