విద్యాసంస్థలు ఫీజుల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలి

విద్యాసంస్థలు ఫీజుల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలి

*జర్నలిస్టుల పిల్లలకు విద్యా సంస్థల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలి..* 

అమలాపురం.పెన్ పవర్, నవంబర్ 7

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల కు ప్రయివేటు విద్యా సంస్థల్లో అకడమిక్ ఫీజు లనుంచి 50 శాతం రాయితీ కల్పించాలని కోరుతూ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ టి.నిషాంతి ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అమలాపురం ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో జిల్లా లో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టు ల పిల్లలకు ప్రయివేటు స్కూల్స్, కాలేజీ ల్లో అకాడమిక్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని జే సీ నిశాంతిని కోరారు.. దీనిపై స్పందించిన జే సీ వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి కి ఫోన్ చేసి దీనికి సంబందించి నోట్ ఫైల్ రూపొందించి జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకు వెళ్లాలని ఆదేశించారు. జేసీ కు వినతి పత్రం సమర్పించిన వారిలో అమలాపురం ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మహ్మద్ బషీర్, కార్యదర్శి కె.సుధీర్, ఉపాదక్ష్యుడు పొట్టుపోతు నాగు, చొల్లంగి శేఖర్, పిండి శేషు, ఎం.ఎస్. ఏ హుస్సేన్(రాజా), ఎం.వెంకటేష్, విష్ణు, పులిమే సురేష్, సాయి ప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts