Manjummel Boys Review గుండెను పిండేసే సర్వైవల్ డ్రామా.. అనుక్షణం ఉత్కంఠతో

మంజుమ్మల్ బాయ్స్ రివ్యూ!

Manjummel Boys Review గుండెను పిండేసే సర్వైవల్ డ్రామా.. అనుక్షణం ఉత్కంఠతో

నటీనటులు: సౌబీన్ షాహీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పోడువల్, లాల్ జూనియర్, దీపక్ పరాంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖాలీద్ రెహ్మాన్, చందు సలీమ్ కుమార్, షెబిన్ బెన్సన్ తదితరులు దర్శకత్వం: చిదంబరం నిర్మాతలు: సౌబీన్ షాహీర్, షాన్ ఆంథోని, బాబు షాహీర్ సినిమాటోగ్రఫి: షైజూ ఖాలీద్ ఎడిటింగ్: వివేక్ హర్షన్ మ్యూజిక్: సుషిన్ శ్యామ్ బ్యానర్: పరవ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్: మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్: 2024-04-06

మంజుమ్మల్ గ్రామానికి చెందిన కొందరు స్నేహితులు అంతా కలిసి కొడైకెనాల్ టూర్‌కు ప్లాన్ చేస్తారు. తమ ఊరి నుంచి కొడైకెనాల్ వెళ్లే క్రమంలో ఫుల్లుగా ఎంజాయ చేస్తూ.. మిత్రుల బృందం చిలిపి పనులు చేస్తూ అక్కడికి చేరుకొంటారు. అక్కడ ఉండే విహార ప్రదేశాల్లో అల్లరి చేస్తూ.. తమ స్నేహితులను ఆటపట్టిస్తూ సరదాగా టూర్‌ను కొనసాగిస్తుంటారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా ఆ గ్రూప్‌లోని సుభాష్‌ ఓ భయంకరమైన లోయలో పడిపోతాడు.

తమ స్నేహితుడు ఊహించని విధంగా సొరంగంలో పడిపోవడంతో ఎలాంటి షాక్‌కు గురయ్యారు? అధికారులకు ఫిర్యాదు చేస్తే.. వారు ఎలా స్పందించారు. తన స్నేహితుడి ఘటనను తీసుకెళ్తే పోలీసులు వారిపైనే హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టాలని చూశారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొన్నారు? చివరకు సుభాష్‌ను 2 వేల అడుగులకుపైగా లోతున్న సొరంగంలోకి నుంచి ఎలా బయటకు తీశారు? ఇంతకు సుభాష్ బతికి బయపడ్డాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే మంజుమ్మల్ Boys సినిమా కథ    

మంజుమ్మల్ Boys విషయానికి వస్తే.. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. బాల్య స్నేహితులందరూ ఒక చోట కలిస్తే ఎలాంటి హంగామా, జోష్ ఉంటుందనే విషయాలను చాలా లైవ్లీగా చూపించడంతో మొదటి భాగమంతా ఫన్‌తో సాగుతుంది. మూవీ తొలి భాగంలో ఫన్‌కు పెద్ద పీట వేసి క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసిన తీరు చాలా బాగుంది. దాంతోనే సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేశారని చెప్పవచ్చు.

ఇక సెకండాఫ్‌లో సుభాష్‌ను లోయలో నుంచి బయటకు తీయడమనే విషయాన్ని చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఒకపక్క అతడిని బయటకు తీసే ప్రయత్నాలు చూపిస్తూనే.. వారి మధ్య ఉండే బాల్యంలోని మెమోరీస్‌ను చక్కగా చూపించడంతో మరింత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరిగింది. చివరి ఒక గంట పాటు ప్రేక్షకుడి సీట్లకు అత్తుకుపోయేలా సినిమాలోని సన్నివేశాలను చూపించాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని తీవ్రమైన భావోద్వేగానికి గురి చేయడంలో దర్శకుడు చిదంబర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.


ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సౌబీన్ షాహీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పోడువల్, లాల్ జూనియర్, దీపక్ పరాంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖాలీద్ రెహ్మాన్, చందు సలీమ్ కుమార్, షెబిన్ బెన్సన్ అందరూ ఎవరికి వారే తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఎమోషనల్ సీన్లలో చక్కగా, సజీవంగా, సహజమైన నటనను ప్రదర్శించారు.

              Manjummel-Boys-11712388053

PEN POWER Rating-3.5/5

About The Author

Related Posts