వరద ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తం

కీటక జనిత వ్యాదుల సోక కుండా చర్యలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరభ్ కుమార్ ప్రసాద్
స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 18: రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని, వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం విజయవాడ సిఎస్ కార్యాలయం నుండి వరద ప్రభావిత ప్రాంతాలలో తాగునీరు. సీజనల్ వ్యాదుల, పునరావాస సహాయక చర్యలుపై సమావేశం నిర్వహించారు.తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విద్యుత్తు సమస్యలు తలెత్తితే ముందుగా జనరేటర్లను సమకూర్చాలని సూచించారు. పాడేరు,చింతూరు, అరకువ్యాలీ,రంపచోడవరం పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ చింతూరు డివిజన్ పరిధిలో 174 గ్రామాలకు వరద ప్రభావం ఉంటుందని చెప్పారు. అధికారులను అప్రమత్తం చేసామని చెప్పారు.మొదటి ప్రమాద హెచ్చరిక రాగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు.బోట్లు,గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.8800 టార్పాలిన్లు, 20 జనరేటర్లను సమకూరుస్తున్నామని పేర్కొన్నారు.వరద ముంపు ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
👉 పునరావాస ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.మలేరియాపై అప్రమత్తంగ ఉండాలని చెప్పారు.మలేరియా ప్రభావిత ప్రాంతాలలో దోమల మందు పిచికారీ పనులు పూర్తి చేయాలని అన్నారు.దోమల మందు పిచికారీ పనులులో అంగన్వాడీ వర్కర్లు,స్వయం సహాయ సంఘాలు, స్థానిక సర్పంచులను భాగ స్వామ్యం చేయాలన్నారు. రానున్న మూడు నెలలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.18 వేల లీటర్లు డీజిల్, 8800 లీటర్ల కిరోసిన్, అవసరమైన పెట్రోల్ సిద్దం చేయాలని అన్నారు. అవసరమైన చోట బోర్వెల్స్ నిర్మించాలని స్పష్టం చేసారు. పునరావాస కేంద్రాలకు తాత్కాలిక లేఅవుట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అవసరమై నిత్యావసర సరుకులు సిద్దం చేయాలని అన్నారు.కీటక జనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ భావనా వశిష్ట,డి.ఆర్.ఓ. ఎం.పద్మావతి,డి. ఆర్. డి. ఏ పి.డి. వి. మురళి,జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నంద్, జిల్లా ఉద్యాన వన అధికారి రమేష్ కుమార్ రావు, సి.పి.ఎస్ ఎస్ ఆర్ కె. పట్నాయక్,గృహ నిర్మాణ శాఖ పి.డి.బి.బాబు తదితరులు పాల్గొన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.