ఆర్టిఫిషల్ జ్యువలరీ మేకింగ్ కోర్స్ నందు శిక్షణ
30 మంది మహిళలకు 45 రోజులు పాటు శిక్షణ కోరమండల్ యాజమాన్యం
జి.వీ.ఎం.సీ పరిధి పశ్చిమ నియోజకవర్గం 60 వార్డ్, హనుమాన్ సంజీవ్ కాలనీలో కోరమండ ల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సౌజన్యముతో హనుమాన్ సంజీవ్ కాలనీలోని మహిళలకు వారు ఆర్ధికంగా ఎదగడానికి వారికి ఆర్టి ఫిషల్ జ్యువలరీ మేకింగ్ కోర్స్ నందు శిక్షణ ను ఏర్పా టు చేశారు. సుమారు 30 మంది మహి ళలకు, 45 రోజులు పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిం చడం జరుగుతుంది,ఈ శిక్షణ కార్య క్రమం నకు కోరమాండల్ సంస్థ సుమారుగా 4 లక్షలు రూపా యలు వెచ్చిస్తున్నారు.శిక్షణ పూర్తి ఐనా అనంత రం వారికి కోర్స్కుసంబంధించి కిట్ అందచేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంనకు ముఖ్యఅతిధిగా కోరమాండల్ సంస్థ డీ.జీ.ఎం.హెచ్.ఆర్,రెడ్డిపల్లి శ్రీనివాస్ రావు, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు. కోరమాండల్ సంస్థ నుంచి శేష పు.వెంకటరమణ -డిప్యూటీ మేనేజర్ -సి.ఎస్. ఆర్, వెనీల హెచ్.ఆర్ డిపార్ట్మెంట్,సి.ఎస్.ఆర్ ప్రతినిధి ధర్మాల వేణు గోపాల రెడ్డి, గ్రామ మహి ళలు పాల్గొన్నారు.
About The Author

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.