పెబ్బంపల్లి గ్రామంలో సర్పంచ్ సారాధ్యంలో పల్లె పండగ
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్ 20:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం అమ్మవారి దారకొండ పంచాయితీ పెద్దంపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ ముర్ల సత్యవతి సారాధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు పల్లె పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఆగస్టు 23వ తేదీన గ్రామసభలు నిర్వహించి గ్రామసభలో తీసుకున్న తీర్మానాలను అనుసరించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీలలో పనులు చేపట్టటం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముర్ల చంటిబాబు ఉపాధి హామీ పథకం సిబ్బంది అప్పలనాయుడు,టెక్నికల్ అసిస్టెంట్ సింహాచలం, ఫీల్డ్ అసిస్టెంట్ ఎం.శాంతి, బల్పర్ అసిస్టెంట్ శ్రీను, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కోటి కిరణ్, వార్డు సభ్యులు కొండబాబు, కృష్ణ కాసులమ్మ, గ్రామస్తులు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.