కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసిన సంఘ నాయకులు
By Admin
On
శ్రీకాకుళం, పెన్ పవర్ 19: జిల్లాలో నూతనంగా పదవీ భాద్యతలు స్వీకరించి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లను జిల్లా ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సిహెచ్. ఉమా శంకర్ ,కార్యదర్శి ఎ. తారకేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ ఉద్యోగులు అందరు కలిసికట్టుగా పనిచేసి జిల్లాకు మంచి పేరును తీసుకురావాలన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే, సమస్యలను సామరస్యంగా పరిష్కరించు కోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టి. సీతారాం, జి. శంకర్, ఎ. పద్మ తదితరులు పాల్గొన్నారు.