రాజకీయ నాయకుల కనుసన్నలలో పనిచేస్తున్న ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు

రాజకీయ నాయకుల కనుసన్నలలో పనిచేస్తున్న ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు

జగ్గంపేట, కాకినాడ జిల్లా.

IMG-20240526-WA0011

 కాకినాడ జిల్లా జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. ఆదివారం జగ్గంపేట ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగ్గంపేట, గండేపల్లి మండలాల ప్రజలకి శుద్ధిచేసిన మంచినీరు సరఫరా చేయడానికి జగ్గంపేట మండలం బావారం గ్రామంలో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి ఫిల్టర్ బెడ్లు, ట్యాంకులు కట్టించారని, కానీ కరెంటు లేదనే సాకుతో శుద్ధి చేసిన నీళ్లు సరఫరా చేయట్లేదని విమర్శించారు. గండేపల్లి మండలానికి త్రాగునీరు అందించే ఫిల్టర్ బెడ్ లు పాడైపోయాయన్నారు. కాంట్రాక్టర్ యధావిధిగా తమ బిల్లులు తీసుకుని, ఫిల్టర్ బెడ్లు రిపేర్ చేయించకుండా, క్లోరినేషన్ చేయకుండా  అధికారులతో కుమ్మక్కై కలుషిత నీటిని ప్రజలకు సరఫరా చేస్తూ ప్రజల అనారోగ్యానికి కారణం అవుతున్నారన్నారు. ఆ నీటిని కూడా మూడు, నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారన్నారు. బావారం గ్రామంలో ఒక భూస్వామి తమ పామాయిల్ తోటకు ఈ నీరును మళ్లించుకుంటున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ తక్కువ మంది సిబ్బందిని పెట్టుకుని పని చేయించుకుంటూ ఎక్కువమందికి జీతాలు రాసుకుంటున్నారన్నారు. సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు , కాంట్రాక్టర్ ల కనుసన్నల్లో పనిచేస్తున్నారన్నారు. అధికారులు, కాంట్రాక్టర్  రాజకీయ నాయకులతో ఏకమై ప్రజలకు త్రాగునీరు అందించకుండా   అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని జగ్గంపేట, గండేపల్లి మండలాల ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతామని వీరాంజనేయులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ సిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి  సతీష్, ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కుంచే అంజిబాబు, ఏపీఆర్ సిఎస్ నాయకులు కర్నాకుల రామలింగేశ్వరరావు, దేశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts