ప్రాణం తీసిన ప్యాంట్..! తండ్రితో వాగ్వాదం..! విద్యార్థి ఆత్మహత్య..!
దుండిగల్ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కళాశాలలో.. ఇంటర్ 1 ఇయర్ విద్యార్ధి సూసైడ్..
డ్రెస్ నచ్చలేదన్న కొడుకు.. మరోడ్రెస్ వేసుకోమని తండ్రి మందలింపు..
రూమ్ మేట్స్‌తో ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్ధి.. అందరూ నిద్రించాక అర్ధరాత్రి ఆత్మహత్య..?
ఇదంతా కళాశాల యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన వివరణ..!
ప్రాణాలు కాపాడేందుకే ఆసుపత్రికి తరలించారా.? లేక మృతదేహాన్ని తరలించారా..?
ఉరేసుకున్న వ్యక్తి ఎంత సమయం ప్రాణాలతో ఉండే అవకాశం ఉంది..?
ఆసుపత్రికి తరలించాకే పోలీసులకు, పేరెంట్స్‌కు సమాచారం ఇవ్వడంలో ఆంతర్యం..
నిర్మాణంలో ఉన్న కళాశాలకు పేరులేదు,అసంపూర్తి భవనంలో తరగతులు,రిస్కులో 440 విద్యార్థులు..
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్ధి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం..?
కళాశాలల్లో విద్యార్థుల చావులు ప్రశ్నార్థకంగా తయారయ్యాయి.. కళాశాల యాజమాన్యం చెప్పే సాకులకు, విద్యార్థుల మరణాలకు పొంతన లేకుండా పోతోంది.. కళాశాల నిర్వహణకు అనుమతులు తీసుకున్నా..! తీసుకోక పోయినా..! అడిగే వారు ఉండకపోవడం ఒక వంతైతే..! కాసుల కక్కుర్తితో, రెసిడెన్షియల్ కాలేజి నిర్వహణకు..! కనీస నిబంధనలు కూడా పాటించక పోవడం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంగా చెప్పవచ్చు.. రెసిడెన్షియల్ కళాశాల నిర్వహణకు యాజమాన్యం అత్యంత శ్రద్ద వహించాలి.. గార్డెన్‌లు, నైట్ వాచ్‌మెన్ విద్యార్థులపై కన్నేయాలి..! దుండిగల్ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కళాశాల విద్యార్ది సూసైడ్ నమ్మశక్యం లేదనిపిస్తోంది..! ఉరేసుకున్న ఎవరైనా కొద్దిసేపట్లోనే ప్రాణాలు కోల్పోతారు.. అయితే కళాశాల నిర్వాహకులు కాపాడటానికి ఆసుపత్రికి తరలించామని, చెప్పడం.. ఆసుపత్రికి వెళ్ళేవరకు విద్యార్ధి సూసైడ్ విషయం, అటు తల్లిదండ్రులకు, ఇటు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఆగష్టు 2:
ఫేర్‌వెల్ పార్టీకీ తండ్రి తనకు నచ్చిన ప్యాంటు కొని ఇవ్వలేదని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం, ఇటుకపల్లి గ్రామానికి చెందిన పుట్టి వినోద భర్త వెంకటేష్‌ల కుమారుడు నిఖిల్ (16)..హైదరాబాద్ దుండిగల్ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం సమీపంలో.. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో "ఎన్ఎస్ఆర్ ఇంపల్స్" పేరుతో నిర్వహిస్తున్న కళాశాలలో నిఖిల్ ఎంపిసి మొదటి సంవత్సరం చదువుతున్నాడు.. కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫేర్‌వెల్ పార్టీ ఉండటంతో.. నిఖిల్‌ను చూడటానికి వచ్చిన తన తండ్రి వెంకటేష్‌తో తనకు కొత్తబట్టలు కొని ఇవ్వమని అడిగాడు.. దీంతో ఈనెల 1వ తేదీన కొత్త బట్టలతో పాటు పుస్తకాలు కూడా కొనుగోలు చేసి ఇచ్చివెళ్ళిపోయాడు..
తండ్రి మందలింపుతోనే..! నిఖిల్ సూసైడ్ చేసుకున్నాడా..?
దుండిగల్ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కళాశాల యాజమాన్యం, దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం (ఆగష్టు 1న) సాయంత్రం 5 గంటలకు కళాశాల ఉద్యోగుల నుండి ఫోన్ అడిగి తీసుకున్న నిఖిల్ తండ్రికి వీడియో కాల్ చేసి మాట్లాడాడని, కొత్త దుస్తుల్లో ప్యాంటు నచ్చలేదని ఫోన్‌లో తెలియజేయగా.. వెంటనే కావాలంటే ఎలా నిఖిల్..! ప్రస్తుతం ఏదో ఒక డ్రెస్ వేసుకోమని తండ్రి వెంకటేష్, నిఖిల్‌ను మందలించినట్లు, విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.. తోటి రూమ్‌మేట్స్‌తో విషయాన్ని చెప్పి బాదపడి, అదేరోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో..! విద్యార్ధి నిఖిల్ సీలింగ్‌కు ఉరేసుకుని మృతి చెందినట్లు ఇటు పోలీసులు, అటు కళాశాల యాజమాన్యం తెలిపారు.. శుక్రవారం రాత్రి 3గంటల సమయంలో కళాశాల సిబ్బంది తన కుమారుని మరణ వార్త తెలియజేశారని మృత విద్యార్ధి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు..
రూమ్ మేట్స్‌ను విచారించిన.. తల్లిదండ్రులు..
వెంటనే నిఖిల్ తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని చూడగా కొడుకు మృతి చెందాడు. తర్వాత నిఖిల్ తల్లిదండ్రులు తమ కొడుకు రూమ్‌మేట్స్, నర్సారెడ్డి, ప్రతీక్ రెడ్డి, నికిలేష్‌ని విచారించగా, తల్లిదండ్రులు తెచ్చిన దుస్తుల వల్ల కొడుకు నిరాశకు గురయ్యాడని తెలిసింది. రూమ్‌మేట్‌లందరూ రాత్రి 11.30 గంటల వరకు అతనితో మాట్లాడి నిద్రపోయారని..! రాత్రి 1 గంట సమయంలో అతని రూమ్‌మేట్‌లో ఒకరు నిద్ర నుండి మేల్కొని నిఖిల్ పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే అతను ఇతర రూమ్‌మేట్స్‌ని నిద్రలేపి..! కళాశాల ఉద్యోగులు అశోక్ మరియు సందీప్‌లకు విషయాన్ని తెలియజేశారు., ఆ తర్వాత వారు అతన్ని కిందకు దించి మల్లా రెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు..
విద్యార్ధి మృతి చెందిన తర్వాత ఆసుపత్రికి ఎందుకు..?
అయితే తల్లిదండ్రులకు మృతిచెందిన విషయాన్ని చెప్పిన తరువాతనే, మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించడంలో కళాశాల యాజమాన్యం ఉద్దేశం..? ఆసుపత్రికి తరలించిన తరువాతే సమాచారం ఇచ్చినట్లు పోలీసులు కూడా తెలియ చేస్తున్నారు.. ఉరేసుకున్న ఏ వ్యక్తి అయినా..! ఎక్కువ సేపు ప్రాణాలతో ఉండరని తెలుసు.. అంతేకాకుండా మృతి చెందినట్లు తెలిసిన తర్వాతే బాడీని ఆసుపత్రికి తరలించారని, పోలీసులకు, తల్లిదండ్రులకు కూడా తర్వాతనే సమాచారం అందించారని చెబుతున్నప్పటికీ.. కళాశాల యాజమాన్యం ఏదో దాస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..?
*రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులపై కళాశాల యాజమాన్యం మరింత శ్రద్ద వహించి.. విద్యార్థుల మరణాలను అరికట్టేందుకు..! సంబంధిత అధికారులు, కళాశాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.. దుండిగల్ ఆశ్రమం సమీపంలో కొనసాగే ఈ "ఎన్ఎస్ఆర్ ఇంపల్స్" కళాశాలను నిర్మాణంలో ఉన్న భవనంలో నిర్వహించడం ప్రమాదకరం.. హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మిస్తున్న ఈ భారీ నిర్మాణంలో 440 మంది విద్యార్థులు ఉన్నట్లు కళాశాల యాజమాన్యం చెబుతున్నదే..! ఓవైపు నిర్మాణ పనులు, మరోవైపు అదే భవనంలో రెసిడెన్షియల్ కళాశాలలో తరగతులు నిర్వహణ అత్యంత ప్రమాదకరం.. దుండిగల్ బ్రాంచి ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కళాశాలకు అనుమతులు కూడా లేవని కళాశాల వారు చెప్రడం గమనార్హం.. హెచ్ఎండిఏ, మున్సిపల్, పోలీసులు తక్షణమే స్పందించి నిర్మాణం పూర్తయ్యే వరకు కళాశాల నిర్వహణ నిలిపి వేయకపోతే ప్రమాదాలు తప్పవు తస్మాత్ జాగ్రత్త..
About The Author
మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.