చెరువులు కాపాడుకుందాం..!
Let's save the ponds..!
నీటి ఎద్దడికి చెక్ పెడదాం.. చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటుకు షాపూర్ నగర్లో సమావేశం.. అఖిలపక్ష ఆధ్వర్యంలో సమావేశమై కమిటీలు ఎంపిక చేపట్టాలని నిర్ణయం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గలో అంతరించి పోతున్న చెరువులు..!
బెంగుళూరు తరహాలో హైదరాబాదుకు నీటి ఎద్దడి ఏర్పడకుండా నీటి ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని..! పలువురు సమావేశమై చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటుపై చర్చించారు.. మంగళవారం కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్లో తాత్కిలిక కమిటీతో సమావేశం నిర్వహించారు
రోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని..! ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అన్నారు.. వందల ఏళ్ళుగా చెక్కుచెదరని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల స్థలాలు..! గత పదేళ్ళుగా పట్టాభూముల పేరుతో కబ్జాకు వదిలేస్తున్నారని అన్నారు.. ఈవిషయమై కమిటీ సభ్యులు చర్చించారు..! నీటి ఆవశ్యకతపై ప్రజలను చైతన్య పరచి చెరువులను కాపాడుకునేందుకు సిద్దం కావలని నిర్ణయించారు..
మన ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చుకోవడానికి..! భవిష్యత్తు తరాలు నీటి సమస్య ఏర్పడకుండా..! హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను కాపాడుకోవడానికి..! పూడికతీత పనులు, ఇంకుడు గుంతలను విధిగా ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమని వాటి ప్రాధాన్యతను ప్రజలు, ప్రభుత్వాలు గుర్తించే విధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చెరువుల పరిరక్షణ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు మంగళవారం షాపూర్ నగర్ సమావేశంలో కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కమిటీ ఆధ్వర్యంలో నీటి ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, చెరువుల పరిరక్షణకై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం, ప్రజల సహకారంతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమలలో మేధావులు, యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా కదలి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు ఉమా మహేష్, రవీందర్ ముదిరాజ్, అశోక్ రెడ్డి, యాకయ్య, రాజు, హరినాథ్, ప్రవీణ్‌లు హాజరయ్యారు..