అణగారిన వర్గాల గుండెచప్పుడు.. బీ.ఆర్ అంబేద్కర్..

అణగారిన వర్గాల గుండెచప్పుడు.. బీ.ఆర్ అంబేద్కర్..

కుత్బుల్లాపూర్, పెన్ పవర్,

సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్..

 

దేశంలోని అణగారిన వర్గాల గుండెచప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడు అంటూ, సిపిఎం మండల కార్యదర్శి కీలుకానీ లక్ష్మణ్ కొనియాడారు.. కుత్బుల్లాపూర్ మండలం సూరారం డివిజన్ అంబేద్కర్ భవన్‌లో భారత రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.. ఉత్సవాలలో పాల్గొన్న కీలుకానీ లక్ష్మణ్ మాట్లాడుతూ..! రాజ్యాంగాన్ని  కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని..! భారతదేశంలోని సామాజిక విభజనపై అస్తృశ్యతా దుర్మార్గంపై జీవితాంతం పోరాడిన మహాయోధుడు బీ.ఆర్ అంబేద్కర్ అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కీలు కాని లక్ష్మణ్ అన్నారు.. రాజ్యాంగ నిర్మాత  దేశంలోని అణగారిన వర్గాల గుండెచప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడు.. ఆ మహనీయుని జన్మదిన సందర్భంగా ఆయన మనకందించిన విలువలను ఆశయాలను మననం చేసుకుని నేడు వాటికి ఎదురవుతున్న సవాళ్లను ఎలా అధిగమించాలో ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు.‌ 

ప్రభుత్వాలు మాట్లాడే,‌ జీవించే హక్కులను హరిస్తున్నారు..

మాటల్లో అంబేద్కర్‌ను పొగుడుతూనే ఆయన ఆశయాలను నిలువునా పాతరా వేస్తున్నారని..! ముఖ్యంగా సామాన్య ప్రజలు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం చేసిన కృషికి పూర్తి విరుద్ధంగా పరిణామాలు..! దేశంలో చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజల జీవించే హక్కును మాట్లాడే హక్కును హరిస్తున్నారని.. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బిజెపి పూర్వం ఉన్న మనుధర్మ శాస్త్రాన్ని మనపై రుద్దడానికి సామాజిక మాధ్యమాల ద్వారా దేశంలో ఉన్న ప్రజల మధ్యన చీలికలు తెస్తూ బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటిస్తున్న విషయాన్ని మనం గమనించాలని ఆయన అన్నారు..

లౌకిక తత్వానికి తూట్లు..

 కులం మతం పేరిట ఈ దేశాన్ని మనువాదంలోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపిలను నిలువరించాలని కీలుకానీ లక్ష్మణ్ కోరారు ఈ దేశంలో వ్యక్తి స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజల హక్కులకు భంగం కలిగిస్తూ లౌకిక తత్వానికి తూట్లు పొడుస్తున్నటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ వారిని నిరోధించడానికి వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక శక్తులు సామాజిక శక్తులు కవులు కళాకారులు ఏకమై రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు గట్టు అశోక్ సత్యనారాయణ బుచ్చన్న ఏసురత్నం యాదగిరి లక్ష్మీ అరుణ శివకుమార్ విజయభాస్కర్ సిపిఎం మండల కమిటీ సభ్యులు పి.అంజయ్య, ఈ దేవదానం, సిఐటియు నాయకులు తిమ్మప్ప, భాస్కర్, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు 

Tags: #news

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts