వ్యర్ధాల డంపింగ్‌లపై పోలీసుల కొరడా.. టిప్పర్‌కి రూ.10వేల జరిమానా..

వ్యర్ధాల డంపింగ్‌లపై పోలీసుల కొరడా.. టిప్పర్‌కి రూ.10వేల జరిమానా..

ప్రభుత్వ భూముల్లో భవన నిర్మాణ వ్యర్ధాల  డంపింగ్ వాహనాలకు ఫైన్ విధింపు..

శుక్రవారం(23న) టిప్పర్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా 5 టిప్పర్‌లు పట్టుకున్న బాచుపల్లి పోలీసులు..

పియస్‌లో ఉంచిన ఐదు టిప్పర్ లారీలకు రూ.10 వేల చొప్పున రూ.50 వేలు జరిమానా..

తాజాగా శనివారం మిథిలా నగర్‌లో మరో 3 టిప్పర్‌లు సీజ్ చేసి జరిమానా..

పోలీసుల లెక్క అధికారులూ కఠినంగా వ్యవహరిస్తే  ప్రభుత్వ భూములు సేఫ్ అంటున్న ప్రజలు..!

ZomboDroid_25082024101200
ప్రభుత్వ స్థలంలో కూల్చివేతల వ్యర్ధాలు డంపింగ్ చేస్తున్న టిప్పర్‌లు సీజ్..

 

ప్రభుత్వ భూములతో పాటు, చెరువులు,కుంటలు, గొలుసుకట్టు కాలువలు మానవ మనుగడలో భాగమైనవి.. అలాంటి వాటిని పరిరక్షించేందుకు, ప్రత్యేక అధికారాలు కల్పించి.. రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ శాఖలకు అప్పగించినా రక్షించలేక పోతున్నారు.. అందుకు సిఫార్సులే కారణమని చెప్పవచ్చు.. ఒక్కో సారి హైకోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతర్ చేసిన ఉదంతాలు చూస్తున్నం.. వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు..! అధికారపార్టీ నేతలు చెప్పినట్టు అనుకూలంగా వ్యవహరించాలని గతంలో జిల్లాకో నేతకు, అనధికారికంగా అప్పగించారు..! ఈ వ్యవహారం బాచుపల్లి కబ్జాలో ఓ తెలుగు చానల్‌లో వైరల్‌గా మారిన న్యూస్ తెలిసిందే.. జవాబుదారీగా ఉండాల్సిన యంత్రాంగం, బాధ్యతా రహితంగా..‌! ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు వదిలేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తరుణంలో ఆపద్భాంధవుడి లెక్కన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనతో "ఆపరేషన్ హైడ్రా" ఎంట్రీ కొందరు అవినీతి అధికారులకు చెక్‌పెట్డేందుకే అంటూ సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.. చెరువులు పరిరక్షించాలని, గండిపేటలో నేడు "హైడ్రా"కు మద్దతుగా ర్యాలీ తీసే స్థాయికి,ప్రజల మన్ననలు పొందుతున్న హైడ్రా తెలంగాణ రాష్ట్రానికి పాశుపతాస్త్రంగా కాపాలగా ఉంది.. హ్యాట్సప్ సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవి.రంగనాథ్ ఐపీఎస్ అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు..

IMG-20240825-WA0117

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఆగష్టు 25:

ఈనెల 22న అర్ధరాత్రి‌, తెల్లవారితే శుక్రవారం అనగా, బాచుపల్లి మండలం నిజాంపేట్ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సమీపంలో.. సర్వే నెంబర్ 186 ప్రభుత్వ భూమిలో భవన నిర్మాణాల వ్యర్ధాలను డంపింగ్ చేస్తున్న విషయాన్ని..! పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో, బాచుపల్లి పోలీసులు స్పందించారు.. గురువారం రాత్రి కాపు కాసిన పోలీసులు.. శుక్రవారం ఉదయం వరకు 5 టిప్పర్ లారీలను అదుపులోకి తీసుకుని, బాచుపల్లి పియస్‌కి తరలించిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ వ్యవహారంలో పలువురు నేతలు ఉన్నట్లు బీజేపీ నాయకులు ఆరోపించారు.. గాజులరామారం, కైసర్ నగర్ ప్రాంతాల నుండి, డిమాలిషన్ చేసిన రూముల వ్యర్ధాలను టిప్పర్‌ల ద్వారా తరలించి గుంతలుగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మట్టి నింపి కబ్జాలకు సులువైన మార్గాన్ని వేస్తున్నట్లు ఆరోపించారు.. 2024 ఆగష్టు 24 శనివారం  అర్ధరాత్రి మిథిలా నగర సమీపంలోని ఖాళీ ప్రదేశంలో టిప్పర్లతో భవన నిర్మాణ వెస్టేజ్‌తో పాటు, పెద్ద పెద్ద బండ రాళ్లు డంప్ చేస్తూ కాలుష్యాన్ని వెదజల్లేందుకు..! ఉపయోగిస్తున్న ప్రమాదకర టిప్పర్‌లతో స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని వచ్చిన ఫిర్యాదులతో..! శనివారం బాచుపల్లి పోలీసులు 3 టిప్పర్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, జరిమానా విధింపు నిమిత్తం నిజాంపేట్  మున్సిపల్ అధికారులకు అప్పగించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. అదేవిధంగా శుక్రవారం నిజాంపేట్‌లో పట్టుబడిన 5 టిప్పర్ లను పట్టుకొని రూ.50 వేలు జరిమానాను, మున్సిపల్ అధికారులచే  విధించామని తెలిపారు.. మరోసారి వ్యర్ధాలు డంపింగ్ చేయకుండా, మొదటి తప్పు కింద..! సదరు టిప్పర్ లారీల యజమానులకి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించినట్లు తెలిపారు.. అయినప్పటికీ మళ్ళీ ఇదే తరహాలో అక్రమ డంపింగులకి పాల్పడితే..! కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.. 

స్థానికుల ఫిర్యాదుతో పోలీసులకు పట్టుబడితేనే సీజర్‌లు, జరిమానాలు విధిస్తారా..? సంబంధిత అధికారుల పర్యవేక్షణా బాధ్యత ఎందుకు లేదు.. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా భవన నిర్మాణ వ్యర్ధాల డంపింగ్‌లు, కబ్జాలపై పత్రికల్లో వస్తేనే పట్టించుకుంటారా..! మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ గౌతమ్, ప్రభుత్వ భూముల్లో అక్రమ డంపింగ్‌లపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.. బౌరంపేట్ సర్వే నెంబర్ 472 దిల్ సంస్థకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో వేలాది టిప్పర్‌ల మట్టి నింపింది ఎవరో రెవెన్యూ అధికారులకు తెలియదా..? నిజాంపేట్ సర్వే నెం.186 ప్రభుత్వ స్థలంలో బిల్డింగ్ వ్యర్ధాలను డంపింగ్ చేసేది ఎవరో రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు తెలియదా..? మిథిలా నగర్ పక్కన ఖాళీగా ఉన్నది సర్వే నెంబర్ 307  స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్‌ సంస్థకి కేటాయించిన ప్రభుత్వ భూమిలో, మట్టి నింపుతున్నది ఎవరో సంబంధిత అధికారుల దృష్టిలో లేదంటారా..?

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts