ఫిర్యాదులు పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు:జిల్లాలో 15 శాతం గ్రోత్ రేటు సాధించాలి:వేసవిలో తాగునీటి ఎద్దడి రాకూడదు

IMG-20250328-WA1003 జిల్లా కలెక్టర్ ఎ.ఎస్ దినేష్ కుమార్

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి, పెన్ పవర్,మార్చి 28:ప్రజల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ హెచ్చరించారు.వినతులపై సక్రమంగా ఎండార్స్మెంట్ వేయాలని ఆదేశించారు. శుక్రవారం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, డిఆర్ఓ కె. పద్మలతతో కలిసి 115 ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పి జి ఆర్ ఎస్ పై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు.పిజిఆర్ గురుంచి ప్రజల నుండి ప్రతికూల ప్రతి స్పందన వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.సచివాలయం పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలు జిల్లా కేంద్రం వరకు రాకూడదన్నారు. సచివాలయం స్థాయిలోనే పరిష్కరించాలన్నారు.జిల్లాలో అభివృద్ధిలో 15 శాతం పురోగతి సాధించాలని చెప్పారు.15 శాతం వృద్ధి సాధించడానికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.ప్రాధమిక రంగాలలో పురోగతి సాధించాలని చెప్పారు.ఖరీఫ్, రబీలో సాగు విస్తీర్ణం పెరగాలన్నారు.వేసవిలో తాగు నీటి సమస్యలు లేకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 

 

👉🏻ఫిర్యాదులు కొన్ని

పెదబయలు మండలం పోయిపల్లి పంచాయతీ అర్లాబు గ్రామస్తులు తన భూమిలో ఉన్న నీలగిరి తోటలు సరికి విక్రయించడానికి అనుమతులు మంజూరు చేయాలని జె.మత్స్యరాజు విసతి పత్రం సమర్పించారు. ముంచంగి పుట్టు మండలం జర్రెల పంచాయతీ కర్రిముకిపుట్టు నుండి చెరుపు వీధి వరకు రోడ్డు నిర్మించాలని అందజేసారు.వి.భీమలింగం దరఖాస్తును అరకు వ్యాలీ మండలం మాడగడ పంచాయతీ ১০. హట్టగుడ గ్రామానికి చెందిన గొల్గోరి కమల ఇల్లు మంజూరు చేయాలని విసతి పత్రంలో పేర్కొన్నారు. పాడేరు మండలం మినుములూరు సర్పంచ్ ఎల్. చిట్టమ్మ సల్ది గెడ్డ వంతెన, రోడ్డు పసులను పూర్తి చేయాలని విసతిపత్రం సమర్పించారు. పెదబయలు మండలం గోమంగి పంచాయతీ పంగళము, సంపంచగి బంద గ్రామస్తులు జి. మాణిక్యం, పి. గోపాల్, పి. బాలకృష్ణ తదితరులు పంగళం, సంపంగిబంధ గ్రామాలకు రోడ్డు నిర్మించాలని కోరారు.

రోడ్డు నిర్మించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్ డి సి లోకేష్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్ బి ఎస్ సంద్, జిల్లా ఉద్యాన వన అధికారి ఎ. రమేష్ కుమార్ రావు, గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇలు కె. వేణుగోపాల్, జి. డేవిడ్రాజు, ఉప సంచాలకులు ఎల్.రజని, రహదారులు భవనాల శాఖ ఇ ఇ బాల సుందరబాబు, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి పి.ఎస్.కుమార్,సర్వే సహాయ సంచాలకులు దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.