పాపం కొరవంగి చంద్రయ్య దీనస్థితి..కాలు శస్త్రచికిత్స కొరకు దాతలు సహాయం చేయాలని వేడుకోలు..
స్టాప్ రిపోర్టర్,పాడేరు/ పెదబయలు/ గూడెం కొత్తవీధి, పెన్ పవర్,ఆగస్టు02:అల్లూరి సీతారామరాజు పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ తూలం గ్రామానికి చెందిన కోరవంగి చంద్రయ్య అనారోగ్య పరిస్థితులలో వారి కుటుంబం దీనస్థితిలో ఉండటంతో వారిని చూసిన పలువురు తీవ్ర విచారం వ్యక్తపరుస్తున్నారు.కోరవంగి చంద్రయ్యకు గత ఎనిమిది సంవత్సరాల నుండి కుడి కాలుకు దీర్ఘకాలిక వ్యాధి రావడంతో వైద్యులు మోకాలు వరకు కాలును తొలగించారు. అయితే మరల ఇప్పుడు అదే కాలుకు మోకాలు నుండి పైకి మళ్లీ పుండు ఏర్పడి మురుగుపోతుంది.భార్య ఇద్దరూ చిన్నపిల్లలతో జీవనం సాగిస్తున్న చంద్రయ్య తన కాలు మళ్లీ మురిగిపోతుండటంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు.కటిక పేదరికం,ఆపై భార్య ఇద్దరు పిల్లలు.ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆయన కుమిలిపోతున్నారు. మరల ఆపరేషన్ చేయించుకోవడానికి చిల్లిగవ్వలేని పరిస్థితి. దీంతో కుటుంబం తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారుు. రోజురోజుకు కాలు కుళ్ళిపోతుంది. ఈయన దీన పరిస్థితిని చూసి పలువురు స్నేహితులు, ఇరుగుపొరుగువారు అతనికి ఏదైనా సహాయం చేయాలని సంకల్పించుకున్నారు.వివిధ ప్రచార మాధ్యమాలలో ఈయన యొక్క దీన పరిస్థితిని వివరిస్తున్నారు.చంద్రయ్య తనకు దాతలు సహాయం చేయాలని, మీరు సహాయం చేస్తే నా కుటుంబాన్ని బ్రతికించిన వారు అవుతారని,దాతలు దయతలచి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని దీనంగా అభ్యర్థిస్తున్నాడు.తనకు ఫోన్ లేదు కాబట్టి తమ కుటుంబ సభ్యుల ఫోన్ పే నెంబర్ కు దాతలు ఎంతో కొంత సహాయం చేసి నా ఆపరేషన్‌కు సహాయం చేయగలరని దీనంగా వేడుకుంటున్నాడు.90142 49128( బుటారి సుబ్బారావు ) నెంబర్‌కు ఫోన్ పే చేయాలని కోరుతున్నారు.ఈయన దీన పరిస్థితిని చూసి పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.పలువురు దాతలు సహాయం చేయాలని, మిత్రులు గ్రామస్తులు కోరుతున్నారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.