రేపటి నుండి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు:జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్
స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగస్టు 18:ఈనెల 19వ తేదీ సోమవారం నుండి ఐదు రోజులపాటు పాడేరు డివిజన్ పరిధిలో 35 సంవత్సరాలు దాటిన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.రొమ్ము, గర్భాశయ,
నోటి క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ పరీక్షలకు వారితోపాటు 35 సంవత్సరాలు దాటిన ప్రజలు కూడా పరీక్షలు చేయించుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈనెల 19వ తేదీన అరకు ఏరియా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తారని,20,21 తేదీలలో పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారని,23వ తేదీన చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.అదేవిధంగా 22వ తేదీన చింతపల్లి మండలం కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారని కలెక్టర్ వివరించారు.ఈ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.