జగన్మోహన్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన అరుకు ఎంపీ దంపతులు
స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 8: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజ రాణి దంపతులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం నిమిత్తం పులివెందుల రావలసిందిగా వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు పులివెందుల వెళ్లి తన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. భారత పార్లమెంట్ మొదటి అవకాశంలోనే అనేక సమస్యలపై అనర్గళంగా పార్లమెంట్లో గళం ఎత్తటం ఎంతో సంతోషదాయకమని మున్ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల కొరకు అనేక పోరాటాలు చేయవలసి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పులివెందులలోని రాజశేఖర్ రెడ్డి గాట్లో నేడు జరిగే జయంతి వేడుకలకు ఎంపీ దంపతులు గుమ్మ తనుజారాణి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శెట్టి వినయ్ పాల్గొననున్నారు.

About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.