మొక్కల పెంచి పర్యావరణాన్ని కాపాడండి:డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయభారతి 

స్టాప్ IMG-20240820-WA0010 రిపోర్టర్,పాడేరు/చింతపల్లి,పెన్ పవర్,ఆగష్టు 20:మొక్కలు నాటి పర్యావరణం కాపాడడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయభారతి అన్నారు.మంగళవారం కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్థానిక ఏపీవో తో కలిసి ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో అమ్మ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి చేత ఒక మొక్కను నాటి దానిని పెంచే బాధ్యత ఆ విద్యార్థికి అప్పగించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో 600వివిధ రకాలైన మొక్కలను నాటుతున్నమన్నారు.ఈ మొక్కలను ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది అన్నారు.ఈ మొక్కలను కళాశాల మైదానం అంతా నాటుతామన్నారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ పాత్రుడు,అధ్యాపకులు రమణ, లీలపావని,రవీంద్రనాయక్,ఈశ్వరరావు,జగత్ రాయ్, విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.