లెని చిల్డ్రన్ హోమ్ వసతి గృహం సీజ్:తహశీల్దార్ రామకృష్ణ.

స్టాప్ రిపోర్టర్,పాడేరు/చింతపల్లి/గూడెం కొత్తవీధి,పెన్ పవర్ ఆగష్టు 20:ఇటీవల కోటపురట్ల మండలం కైలాసపట్నం అనాధాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు గిరిజన విద్యార్థులు మృతి చెందిన సంఘటనను దృష్టిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేని చిల్డ్రన్ హోమ్ లను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశించడంతో అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక తహశీల్దార్ ఆధ్వర్యంలో మండల పరిషత్,మండల విద్యాశాఖ,మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ,పోలీస్ శాఖల సమన్వయంతో కమిటీ ఏర్పాటు చేసి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్) పిడి సూర్యలక్ష్మి తో కలిసి తహశీల్దార్ టి. రామకృష్ణ లెని చిల్డ్రన్ హోమ్,బాల సాధన,వెనుకబడిన తరగతుల వసతి గృహలను సందర్శించి వసతి గృహాలలో వండిన భోజనం, వసతి సౌకర్యాలపై రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్,అంతర్ల గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన లెని చిల్డ్రన్ హోమ్ వసతి గృహంలో సుమారు 24 మంది విద్యార్థిని,విద్యార్థులు ఉంటున్నారని,లెని చిల్డ్రన్ హోమ్ వసతి గృహంలో విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి రికార్డులు లేవని,విద్యార్థులకు వసతి సౌకర్యం ఏర్పాటుకు కావాల్సిన ఆదాయ వనరుల రికార్డులు లేవని,నిర్వాహకులను ప్రశ్నిస్తే విద్యార్థుల ఆధార్ కార్డులు కూడ లేదని గుర్తించడం జరిగిందన్నారు.గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు సంబంధించి గిరిజన పాఠశాలలు ఉన్నాయని ఆ పాఠశాలలలో బడుగు బలహీన విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. 24 మంది విద్యార్థులను పాఠశాలలకు తరలించడం జరిగిందని, వారి ఆధార్ కార్డులు ఆధారంగా తల్లిదండ్రులను రప్పించి తల్లిదండ్రులకు పాఠశాలలు, వసతి గృహాలపై కౌన్సిలింగ్ నిర్వహించి, విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ వసతి గృహాలలోనే రక్షణ ఉంటుందని వివరిస్తామన్నారు.లెని చిల్డ్రన్ హోమ్ వసతి గృహం సీజ్ చేయడం జరిగిందని కలెక్టర్ ఆదేశాలు వచ్చేంతవరకు సీజ్ చేసిన లెని చిల్డ్రన్ హోమ్ తెరవరాదని ఆయన అన్నారు.ఇదే భాగంలో చింతపల్లి సెంటెన్స్ హై స్కూల్ వసతి గృహం పరిశీలించారు వారి యొక్క రికార్డులు కూడా పరిశీలించారు,ఈ కార్యక్రమంలో ఏటిడబ్ల్యుఓ నాగ జయలక్ష్మి,మండల విద్యాశాఖ అధికారులు పనసల ప్రసాద్,జి.బోడం నాయుడు, మండల అడ్మినిస్ట్రేషన్ అధికారి రవీంద్ర,

IMG-20240820-WA0839
లెని చిల్డ్రన్ హోమ్ వసతి గృహం సీజ్ చేస్తున్న అధికారులు

పాడేరు చిల్డ్రన్ ఉమెన్ రైట్స్ ఆర్ ఉర్మిళ, ఉమెన్ మరియు చిల్డ్రన్ రైట్స్ అధికారి వెంకటరమణమూర్తి, సిడిపిఓ రామలక్ష్మి,సీఐ రమేష్,ఎస్సై అరుణ్ కిరణ్,ఆర్ఐ ఎం క్రిష్ణమూర్తి,వీఆర్వోలు ఎస్ కృష్ణారావు, ఎస్ విష్ణు,మహిళా పోలీస్ ఎం.సునీత కుమారి,ఏఎన్ఎం విజయలక్ష్మి,ఆశా కార్యకర్త నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.