రేపు మండల కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు: వైసిపి మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, డిసెంబర్ 20: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రాల్లో డిసెంబర్ 21వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మండల వైసిపి అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎంపీపీ బోయిన కుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న వైసీపీ ఎంపీటీసీలు,సర్పంచులు,వార్డు సభ్యులు, వైసిపి వివిధ అనుబంధ సంఘాలలో నియమితులైన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని కోరారు.
అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బొబ్బిలి లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.