పోలీస్ కానిస్టేబుళ్లను ఢీకొన్న కారు గంజాయి తరలిస్తున్నదేనని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

68.6 కేజీల గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్ 

పోలీస్ కానిస్టేబుళ్లను ఢీకొన్న కారు గంజాయి తరలిస్తున్నదేనని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

డిసెంబర్ 31 వ తేదీ అర్ధరాత్రి కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారు ఢీకొట్టి ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై వివరాలు వెల్లడించారు. కృష్ణవరం టోల్గేట్ వద్ద వాహన తనిఖీల్లో కారును నిలువరిస్తుండగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన కారు ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయిందని వెంటనే ఐదు బృందాలుగా దర్యాప్తు చేపట్టి 24 గంటలు తిరగకుండా నిందితుల్ని పట్టుకున్నట్లు తెలిపారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగడ్ కు గంజాయి తరలిస్తుండగా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామం పోలవరం కెనాల్ వద్ద కారు స్వాధీనం చేసుకుని ముద్దాయిలు తరుణ్ కుమార్, జాహిద్, ముస్తాకిమ్, మొహమ్మద్ జాకీర్ ను అరెస్టు చేశామన్నారు. ఈ కారులో మూడు బ్యాగుల్లోని 31 ప్యాకెట్లలో రూ. 3.43 లక్షలు విలువ చేసే 68.6 కేజీల గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని కోర్టు లో హాజరు పరుస్తామన్నారు. గాయాల పాలైన కానిస్టేబుల్ లోవరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతన్ని పరామర్శించానన్నారు. విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన జగ్గంపేట సిఐ వై ఆర్ కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ సతీష్, వారి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags:

About The Author