జగ్గంపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే
By G ANIL KUMAR
On
జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కాలేజీలో డయాస్ ఏర్పాటు చేస్తామని, రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: