బుడగ తెచ్చిన గొడవ.. నలుగురు అరెస్ట్

బుడగ తెచ్చిన గొడవ.. నలుగురు అరెస్ట్

చిన్నపిల్లోడు సరదాగా ఆడుకుంటున్న బుడగ వల్ల గొడవై నలుగురు అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన సంఘటన మంగళవారం జగ్గంపేట మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి జగ్గంపేట సీఐ వైఆర్ కే శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన డి.ఏసు ఇంటి వద్ద గత నెలలో రాత్రి 8 గంటల సమయంలో ఏసు మనవడు బుడగలతో ఆడుకుంటుండగా ఆ బుడగ వెళ్లి అదే వీధిలో గల బి.మార్తమ్మకు తగలడంతో ఆమె ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే వారి కుటుంబ సభ్యులైన బి.కృష్ణ బి.రాజేష్ పి.ఆనంద్ కుమార్ మరో ఇద్దరు మహిళలు కలిసి గునపాలు, కర్రలు, రాళ్లతో ఏసు ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఏసు కుడి చెయ్యి విరిగి గాయం కావడం, కుటుంబీకులు గాయాలు పాలయ్యారు. దీనిపై ఏసు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి ముద్దాయిలైన బి.రాజేష్, పి.ఆనంద్ కుమార్ మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారికి 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. ఎవరైనా ఘర్షణలకు దిగితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. 

Tags:

About The Author