సానుభూతి కోసమే.. కోడికత్తి తరహాలోనే గులకరాయి దాడి
కరప,
కూటమి పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు తంగెళ్ల, పంతం, టీడీపీ కోఆర్డినేటర్ సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ
కరప, పెన్ పవర్, ఏప్రిల్ 14: 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి డ్రామాకు, విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎంపై జరిగిన గులకరాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదని కాకినాడ పార్లమెంట్, కాకినాడ రూరల్ అసెంబ్లీ కూటమి అభ్యర్థులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పంతం నానాజీ, టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. ఓట్ల కోసమే జగన్ సానుభూతి నాటకాలు ఆడుతున్నారని వారు ఎద్దేవా చేశారు. మండల పరిధిలోని గొర్రిపూడి గ్రామంలో ఆదివారం కాకినాడ రూరల్ కో కో ఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి సభ్యులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు డాక్టర్ బొండా సూర్యరావు, దేవు మధు విరేష్ మరియు జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు ఓట్లు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు చుండ్రు వెంకన్న చౌదరి, కోటగిరి మహేంద్ర బాబు, రెడ్డిపల్లి నారాయణరావు, తుమ్మలపల్లి మాచర్రావు, గండి వెంకటేశ్వరరావు, యనమదల వెంకటలక్ష్మి దొరబాబు, ఓలేటి సూర్యనారాయణ, గండి యారీష్ కుమార్, కానూరు సురేష్, పంపన కన్నారావు, రెడ్డి వీర వెంకట సత్యనారాయణ, చీపురుపల్లి జయేంద్రబాబు, పులపకూర శుభ మహేష్ తదితరులు పాల్గొన్నారు.