వైజాగ్‌ జాయ్‌...హానీ ట్రాప్‌ లో ప్రముఖులు...

vizag-is-popular-in-the-joyhani-trap

వైజాగ్‌ జాయ్‌...హానీ ట్రాప్‌ లో ప్రముఖులు...

అందమైన మహిళ. ఒంపుసొంపులన్నీ చూపిస్తూ వీడియోలు తీస్తుంది. ఇన్‌ స్టాలో అప్‌ లోడ్‌ చేస్తుంది. కొందరితో పరిచయాలు పెంచుకుంటుంది. వారితో సన్నిహితంగా మెలిగి వీడియో తీసుకుని బ్లాక్‌ మెయిలింగ్‌ చేస్తుంది. ఆమె వలలో పడిన ప్రముఖులంతా కోట్లకు కోట్లు సమర్పించుకుంటారు.

13

క్రైం బ్యూరో పెన్‌పవర్‌ విశాఖపట్నం, అక్టోబరు 8: 


అందమైన మహిళ. ఒంపుసొంపులన్నీ చూపిస్తూ వీడియోలు తీస్తుంది. ఇన్‌ స్టాలో అప్‌ లోడ్‌ చేస్తుంది. కొందరితో పరిచయాలు పెంచుకుంటుంది. వారితో సన్నిహితంగా మెలిగి వీడియో తీసుకుని బ్లాక్‌ మెయిలింగ్‌ చేస్తుంది. ఆమె వలలో పడిన ప్రముఖులంతా కోట్లకు కోట్లు సమర్పించుకుంటారు. ఎందుకంటే.. అటు పోలీసులకు చెప్పుకోలేరు.. ఇటు డబ్బులు ఇవ్వకుండ ఆపలేరు. ఎందుకంటే వారు ప్రముఖులు మరి. వారి పరిస్థితిని ప్రత్యేకంగా అర్థం చేసుకున్న జాయ్‌ అనే మహిళ ఇదే ప్లాన్‌ పక్కాగా అమలు చేసింది.  ఎంత మంది ప్రముఖులని నిండా ముంచిందో కానీ.. ఇద్దరు భరించలేక పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు సీక్రెట్‌గా జరిగిన ఓ ఆపరేషన్‌ లో జాయ్‌ జెవిూమా అనే మహిళను అరెస్టు చేశారు. ఆ అరెస్టు గురించిన  వివరాలను విశాఖ సీపీ శంఖబ్రద బాగ్చీ విూడియాకు వెల్లడిరచారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోషల్‌ విూడియాలో ముందుగా అందమైన అమ్మాయిల వీడియోలను అప్‌ లోడ్‌ చేస్తారు. వాటిని  విస్తృతంగా సర్క్యులేట్‌ చేసుకుంటారు. ఆ అమ్మాయిలను హై ఫై పార్టీలకు, హోటళ్లకు పంపుతారు. అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలతో పాటు బాగా డబ్బు ఉండి పలుకుబడి ఉన్న వారిని మాటల్లోకి దింపుతారు. మెల్లగా హనీ ట్రాప్‌ వేస్తారు.             హోటల్‌లో కలుద్దామని చెప్పి.. పిలిచిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి ఎవరికీ తెలియకుండా  హోటల్‌కు వస్తాడు. ముందుగా డ్రిరక్స్‌ చేద్దామని చెప్పి ఆ మహిళ మత్తు మందు కలిపిన మద్యం ఇస్తుంది. అది తాగా ఆ వ్యక్తి పడిపోతే.. వెంటనే.. న్యూడ్‌ గా మార్చేసి ఫోటోలు, వీడియోలు తీసుకుని మాయమైపోతారు. రెండు, మూడు రోజుల తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది . శాంపిల్‌ ఫోటోలు వీడియోలు సెండ్‌ చేసి.. బయటపడకుండా ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనంటారు. సమాజంలో పలుకుబడి ఉన్న వారు కావడంతో అవి బయటపడితే పరువు పోతుందని డబ్బులు సమర్పించుకుటూ ఉంటారు. చివరికి ఈ వేధింపులు భరించలేని వారు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతానికి జాయ్‌ అనే మహిళ ఇందులో కీలకంగా ఉందని  గుర్తించి అరెస్టు చేశారు. ఈ జాయ్‌ హనీట్రాప్‌ వెనుక పెద్ద రాకెట్‌ ఉందని  .. జాయ్‌ హనీ ట్రాప్లో చాలా మంది చిక్కుకున్నారని  పోలీసులు అనుమానిస్తున్నారు. మాయలేడి జాయ్‌  గతంలోనూ ఇదే తరహాలో పలువురిని మోసగించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అయితే బాధితులు బయటకు రావడం లేదు. పేర్లు సీక్రెట్‌ గా ఉంచుతామని ఇలా మోసపోయిన వారు వచ్చి ఫిర్యాదులు చేయవచ్చని పోలీసులు ఆహ్వానిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయని వారిలో పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

About The Author