"పెన్ పవర్ ఎఫెక్ట్"తో.. ప్రభుత్వ హెచ్చరిక బోర్డు..
లక్ష్మీశ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కబ్జాలపై వరుస కథనాలు..
దుండిగల్ మండలం మల్లంపేట్ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌లో ఆక్రమణల పర్వంపై ప్రత్యేక కథనాలు..
ప్రభుత్వ భూమికి హెచ్ఎండిఏ అనుమతులు అన్న శీర్షికతో సంబంధిత శాఖకు తహశీల్దార్ లేఖ..
*కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతో గురువారం ప్రభుత్వ హెచ్చరిక బోర్డు పెట్టిన తహశీల్దార్ మతీన్..
సుమారు రూ.400 కోట్ల కుంభకోణంపై అధికారుల చర్యలు షురూ..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, జూలై 11:
మల్లంపేట్ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కబ్జాలపై
"పెన్ పవర్" దినపత్రికలో వచ్చిన వరుస కథనాలతో రెవెన్యూ యంత్రాంగం స్పందించింది.. ఈనెల 5న " ప్రభుత్వ భూమిలో.. హెచ్ఎండిఏ అనుమతులు " అన్న కథనంతో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్పందించారు.. బహుదూర్‌పల్లి సర్వే నెం.227 అక్రమ షెడ్డుపై,..! మల్లంపేట్ విజయలక్ష్మి కబ్జసలపై ఆర్డీవో శ్యామ్ ప్రకాష్‌కి చర్యలకు రెండు రోజుల క్రితమే ఆదేశాలు ఇవ్వడంతో, ఆర్డీవో ఆదేశానుసారం గురువారం దుండిగల్ తహశీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతీన్, సర్వేయర్ రూప ఆధ్వర్యంలో..! మల్లంపేట్ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌లో ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.. ఏదిఏమైనప్పటికీ విజయలక్ష్మి విల్లాల్లో సమస్యలు పరిష్కరించ లేకపోయినా జరుగబోయే కబ్జాలకు మాత్రం బ్రేక్ వేశారు.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతల నుండి సిఫార్సుల ఫొన్‌కాల్స్ ఒత్తిడి పెరిగినందు వల్లే చర్యలకు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.. ప్రభుత్వ బోర్డు ఏర్పాటును, మళ్ళీ సిఫార్సులతో తొలగించే అవకాశం ఉందని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు..
దుండిగల్ మున్సిపల్ మల్లంపేట గ్రామ సర్వేనెంబర్ 170 / 3, 170/4, 170/5,లోని 12.5 ఎకరాల భూమిలో "లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ తప్పుడు గ్రామపంచాయతీ అనుమతులు సృష్టించి 260 విల్లాల నిర్మాణం చేపట్టారని..! 2021లోనే అప్పటి కలెక్టర్ ఎస్.హరీష్ దుండిగల్ మున్సిపల్ అధికారులను ఆదేశాలు.. టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో వెళ్ళి అసంపూర్తి విల్లాలను సీజ్ చేసి బ్యానర్‌లు.. ఆతర్వాత 208 విల్లాలు నిషేధిత జాబితాలో పెట్టడం..! ఇంతవరకు అధికారుల విధులు బాగానే ఉన్నప్పటికీ..! నేతల పలుకుబడితో బిల్డర్ విజయలక్ష్మి అక్రమ కట్టడాలు పూర్తిచేయడంలో నాలుగు శాఖల అధికారుల అండ లభించింది.. దీంతో గత మార్చినెలలో..! సర్వే నెం.170 ప్రభుత్వ భూమిలో హెచ్ఎండిఏ నుండి మరో 17 విల్లాలకు అనుమతులు తెచ్చుకోవడం గమనార్హం.. బడానిర్మాణ సంస్థలకు అధికారుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని మరోసారి రుజువు చేశారు..
About The Author
మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.