జి మూల పాలెం బ్రిడ్జికి మహర్దశ.
జి మూలపాలెం బ్రిడ్జ్ నుంచి పరిశీలించిన కలెక్టర్
76 కోట్లు నిధులతో పనులు ప్రారంభం
కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్.
ఐ పోలవరం,/అమలాపురం , పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 7:
జిల్లావ్యాప్తంగా రహ దారులను గుంతల రహితంగా తీర్చిదిద్దేం దుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా గురు వారం మండల పరిధి లోని జి మూల పాలెం గ్రామంలో గతంలో మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో బ్రిడ్జి స్థితిగతులపై నివేదికల ఆధారంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008వ సంవత్సరంలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి నిర్మాణ పనులు మధ్యలో నిలిచి పోవడం జరిగిందని మర ల ఈ బ్రిడ్జి నిర్మాణo కొనసాగిస్తూ పునరుద్ధ రణకై ప్రభుత్వం రూ 76 కోట్లు మేర నిధులు మంజూరు చేసిందని తెలిపారు ఈ యొక్క నిధుల తో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేం దుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ సూప రింటెండెంట్ ఇంజనీర్ బి రాము, డివిజనల్ ఇంజనీర్ వర్మ జూనియర్ ఇంజనీర్ ఆశ్రిత, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.