గంజాయి డ్రగ్స్ విక్రేతలపై నిఘా..! డాగ్ తేజా తనిఖీలు..!

గంజాయి డ్రగ్స్ విక్రేతలపై నిఘా..! డాగ్ తేజా తనిఖీలు..!

సైబరాబాద్ సీపీ.. మేడ్చల్ డీసీపీ..ఆదేశాల మేరకు దుండిగల్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు..

సిఐ శంకరయ్య ఆధ్వర్యంలో గండిమైసమ్మ చౌరస్తాలో 20 షాపుల్లో డాగ్ తేజా తనిఖీలు..

దుండిగల్ పియస్ పరిధిలో మాదకద్రవ్యాలపై  ప్రత్యేక నిఘా ఏర్పాటు..

IMG-20240709-WA0023
మాదకద్రవ్యాలపై దుండిగల్‌ పోలీసులు స్నైపర్ డాగ్ తేజాతో విస్తృత తనిఖీలు..

 

సైబరాబాద్ వ్యాప్తంగా ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలు..! విద్యార్థులే టార్గెట్‌గా మత్తులో దింపుతున్న వారిపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.. యువత పెడదారి పట్టకుండా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి.. డ్రగ్ మాఫియాను రూపుమాపేందుకు ప్రత్యేక విభాగాలను నియమించింది.. గంజాయి రవాణా మూలాలు, విక్రేతలు, మాదకద్రవ్యాలు వినియోగించే వారిపై విస్తృతంగా నిఘా పెట్టి చర్యలు చేపడుతున్నప్పటికీ..!  డ్రగ్ మాఫియా విభిన్న మార్గాలను ఎంచుకుంటూ, గంజాయి, మాదకద్రవ్యాలు గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు.. విద్యార్థులే కాదు.. భవన నిర్మాణ కూలీలు కూడా మత్తుకు బానిసలై పోతున్నారు..గతంలో భవన నిర్మాణ కార్మికులే లక్ష్యంగా గంజాయి ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటనల దృష్ట్యా పోలీసులు ఆ కోణంలో కూడా నిఘా పటిష్ఠం చేయాలని పలువురి విజ్ఞప్తి..

IMG-20240709-WA0020

దుండిగల్, పెన్ పవర్, జూలై 9:

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిదిలో మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా..! సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీ ఆదేశానుసారం గంజాయి, డ్రగ్స్ విక్రేతలను గుర్తించేందుకు..! ప్రత్యేక శిక్షణ పొందిన "స్నైపర్ డాగ్ తేజా"తో..! పోలీసులు గండిమైసమ్మ చౌరస్తాలోని 20 షాపులను విస్తృత తనిఖీలు చేపట్టారు.. దుండిగల్‌ సీఐ శంకరయ్య  ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.. టెక్‌మహేంద్రా యూనివర్సిటీ సమీపంలోని హోటల్స్, ఫాన్ షాప్స్, గండిమైసమ్మ లోని హోటల్స్, బేకరీ,విద్యార్థుల సమూహం వద్ద,  స్నైపర్ డాగ్ తేజాతో పోలీసుల విస్తృతంగా తనీఖీలు చేశారు.. బిటెక్ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి,డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్న సమాచారం మేరకు తనీఖీలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.. దుండిగల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక టీమ్‌ను నియమించి గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు దుండిగల్‌ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య తెలిపారు.. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు విక్రయాలపై,ప్రజలు సామాజిక బాధ్యతతో పోలీసులకు సమాచారం అందజేయాలని పోలీసులు సూచించారు.. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు, రవాణాపై కఠినమైన చట్టాలతో శిక్షకు అర్హులు అవుతారని తనిఖీల సమయంలో షాపు యజమానులను హెచ్చరించారు..  ఈ మాదకద్రవ్యాల తనిఖీ లలో దుండిగల్‌ సిఐ శంకరయ్య, ఎస్సై శంకర్, ఎస్సై రాజేష్, ఏఎస్సై లక్ష్మి రెడ్డి, మరియు సిబ్బంది పాల్గొన్నారు..

IMG-20240709-WA0019

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts