ఒక్క తుపాకీ.. 15 మంది నిందితులు..

గాజులరామారం కాల్పుల ఘటనపై నిందితుల అరెస్ట్.. డీసీపీ ప్రెస్‌మీట్..

ఒక్క తుపాకీ.. 15 మంది నిందితులు..

ఒక దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక బైక్‌ స్వాధీనం..

కాల్పులకు దారితీసిన పెట్రోల్ దొంగతనం..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గన్ కల్చర్‌..

ల్యాండ్ గ్రాబర్స్‌కు ప్రభుత్వ భూములు పట్టం కడుతున్నారని సర్వత్రా ఆరోపణలు..

లాండ్ సెటిల్మెంట్‌ల కోసం తుపాకీ కొన్న పాత నేరగాడు నరేష్..

బీఆర్ఎస్ నేతగా చలామణి అవుతున్న నరేష్..

నరేష్‌పై రౌడీ షీట్ తెరుస్తామన్న పోలీసులు..

పిడి యాక్ట్ పెడ్తామన్న డిసిపి కోటిరెడ్డి.. తదుపరి విచారణ కూడా ఉంటుందన్నారు..

నిందితుల మధ్య వారి సంబంధం తదితర వివరాలపై స్పష్టత కొరవడుతుంది..

ZomboDroid_30082024103743

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాన్ని చివరికి గన్ కల్చర్‌గా మారుస్తున్నారా..? ప్రభుత్వ భూముల కబ్జాలతో కోట్లకు పడగలెత్తిన ల్యాండ్ గ్రాబర్స్‌ ఇప్పుడు తుపాకులతో కాల్పులకు దిగారంటే.. పోలీస్ నిఘా వ్యవస్థ కుంటు పడిందా..? అదృష్ట వశాత్తు ప్రాణనష్టం సంభవించ లేదు కాబట్టి పర్వాలేదు.. కాల్పులకు కారణం ఏదైనా.‌.! దుండిగల్‌ మల్లంపేట్‌లో ల్యాండ్ గ్రాబర్స్‌ గన్ కల్చర్‌ ప్రారంభించినట్లు, ఈ కాల్పుల ఉదంతంతో స్పష్టమవుతుంది.. మరోవైపు 15 మంది నిందితుల నడుమ ఉన్న సంబందం, అర్ధరాత్రి జరిగిన ఈ‌కాల్పుల ఘటనలో ఉన్న, మహిళ ప్రధాన నిందితుడు నరేష్‌‌కు ఫోన్ చేయడం, వారి మధ్యన ఉన్న సంబంధం తదితర వివారలపై స్పష్టత కొరవడింది.. నిందితులు ఇతర రాష్ట్రం నుండి గన్‌తో పాటు బుల్లెట్‌లు ఖరీదు చేసి,తీసుకొచ్చి నెల రోజులుగా మల్లంపేట్‌ పరిసర ప్రాంతాలలో తిరుగుతుండటం వెనుక ఎవరైనా ఉన్నారా..? అనేది అసంపూర్తి సమాచారంగా స్పష్టమవుతుంది..?

IMG-20240830-WA0102

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఆగష్టు 30:

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం ఎల్ ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద 27 అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటన నిందితులను అరెస్ట్ చేసినట్టు బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించారు.. ల్యాండ్ సెటిల్మెంట్‌ల వద్ద బెదిరింపుల కోసం, గన్ కొనుగోలు చేసినట్లు పత్రికా సమావేశంలో పోలీసులు వెల్లడించారు.. బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి పత్రికా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపేట్‌కు చెందిన పూర్ణిమ (35), అజయ్ చంద్ర (21), గౌతం (24) లు ఈనెల 28వ తారీకు రాత్రి ఒంటిగంట సమయంలో మల్లంపేట నుంచి గాజులరామారం మీదుగా అవెంజర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా..! ఎల్ ఎన్ బార్ రెస్టారెంట్ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనంలో పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది.. దీంతో గౌతం బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనం నుంచి పెట్రోల్ చోరీ చేయటానికి ప్రయత్నించాడు. చోరీ యత్నాన్ని గమనించిన బార్ క్యాషియర్ అఖిలేష్ గౌతమ్‌ను ప్రశ్నించాడని, ఈ సందర్భంలో గౌతం దుర్భాషలాడుతూ అఖిలేష్‌పై తిరగబడ్డాడు. బయట గొడవ జరుగుతుండడంతో బార్‌లో పనిచేసే వ్యక్తులు బయటకు రావడం‌తో పరిస్థితి తీవ్రంగా మారబోతుందని భావించిన, పూర్ణిమ మల్లంపేటకు చెందిన నరేష్‌కు ఫోన్ చేసిందని..! శివ అనే వ్యక్తితో కలిసి తార్ వాహనంలో రెస్టారెంట్ వద్దకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.. నరేష్ ఫ్రెండ్స్ సోహెల్, సైమన్స్ , నరేందర్, ఉజ్వల్ మరో బెలైనో వాహనంలో అక్కడకు చేరుకున్నారు.. వీరి రాకతో గొడవ పెద్దది కావడంతో నరేష్ తనతో వచ్చిన శివను గన్‌తో ఫైర్ చేయమని చెప్పడంతో శివ ఒకసారి గాల్లోకి మరొకసారి అక్కడ గొడవ పడుతున్న బార్ అండ్ రెస్టారెంట్ వారిపై కాల్పులు జరిపాడని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.. దీంతో బార్‌కు సంబంధించిన అఖిలేష్, నిశాంత్, ఇతర వర్కర్స్ పారిపోతుండగా నరేష్ తన తార్ వాహనంతో నిశాంత్ మీదకు దూసుకెళ్లాడు. దీంతో నిశాంత్‌కు గాయాలు అయ్యాయి. అనంతరం నరేష్ జీడిమెట్ల పోలీసులకు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్లే గౌతమ్‌నీ కొట్టి బెదిరించారని అజయ్ చంద్ర‌తో ఫిర్యాదు ఇప్పించి వెళ్లిపోయారని ప్రెస్‌మీట్‌లో డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు..

బార్ అండ్ రెస్టారెంట్ ఫిర్యాదుతో.. వెలుగులోకి తుపాకీ ఘటన..

అప్పటివరకు కేవలం సాధారణ ఘర్షణగానే భావించిన పోలీసులు పిస్టల్‌తో కాల్పులు అని తెలిసిన వెంటనే ఉలిక్కిపడ్డారు..ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎల్ ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ క్యాషియర్ అఖిలేష్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పిస్టల్‌తో కాల్పులు జరిపారని ఫిర్యాదు చేశాడు. దీంతో కాల్పులను ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్ణిమ, గౌతమ్, అజయ్ చంద్ర, సోహెల్, సాంసంగ్, నరేందర్, ఉజ్వల్ లను అదుపులోకి తీసుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.. 

పోలీసుల విచారణలో కీలక సమాచారం..

పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు నరేష్ కీలక సమాచారం బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది.. ల్యాండ్ సెటిల్మెంట్‌ల కోసం, నెల క్రితం నరేష్ తన స్నేహితులైన సమీర్, బుగ్గప్ప, కిరణ్, జగ్గులతో బీహార్‌కు కలిసి వెళ్లారని.. గతంలో మల్లంపేట్‌లో  పరిచయమైన అమిత్ సహాయంతో దేశీయ తుపాకీతో పాటుగా 100 బుల్లెట్లను రూ. 80 వేలకు కొనుగోలు చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నరేష్ తన వ్యాపారంలో ఎవరైనా అడ్డువస్తే తన వద్ద ఉన్న తుపాకీతో బెదిరించేందు కొనుగోలు చేసినట్టు  పోలీసులు విచారణలో తేలింది.. కాల్పులు చేసిన పిస్టల్ బుల్లెట్లను శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద దాచడంతో పోలీసులు శ్రీకాంత్‌ను కూడా అదుపులోకి తీసుకొని పిస్టల్‌తో పాటుగా 37 బుల్లెట్లను పోలీసులు స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు.. కూకట్‌పల్లి ప్రాంతంలో స్కోడా కార్‌లో తిరుగుతున్న నిందితుడు నరేష్, సమీర్‌లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న 50 బుల్లెట్లను, ఒక కార్, స్వాధీనం చేసుకున్నారు..

 

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.