ఇద్దరు ఉపాధి హామీ ఉద్యోగులు సస్పెండ్

జగ్గంపేట, కాకినాడ జిల్లా.

 

కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన ఇద్దరు ఉపాధి హామీ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహం తరపున జగ్గంపేటకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గొల్లపల్లి రత్నరాజు, సీనియర్ మేట్ రెడ్డి భాను ప్రతాప్ ప్రచారంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలను ప్రభావితం చేస్తూ వైసిపి అభ్యర్థికి ఓటేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పలువురు వీరి పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫోటోలు తో కూడిన ఆధారాలను, వినతిపత్రాలు అందజేశారు. వాటిని జగ్గంపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కు పంపారు. జిల్లా డ్వమా పిడి అభియోగాలను పరిశీలించి నిజనిర్ధారణ చేసి వారిద్దరిని విధుల నుంచి తక్షణం తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించి మస్టర్లు వేసే సెల్ ఫోన్, సిమ్ములు స్వాధీనం చేసుకోవాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు.

Tags:

About The Author

Related Posts