నాటు సారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం:జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్
స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మార్చి 20: నాటు సారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేసారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నుండి నాటు సారా నివారణపై రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ నాటు సారా తయారీ దారులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని సూచించారు.నాటు సారా నివారణకు గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని తెలియజేసారు. గ్రామ మండల స్థాయి, డివిజన్ స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమిస్తామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో నాటు సారా నిర్మూలన చర్యలు చేపట్టాలన్నారు. తయారీదారులు గ్రామస్తులు నివారణకు సహకరించకపోతే నాటు సారా తయారు చేసే గ్రామాలకు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయని గ్రామస్తులకు వివరించాలన్నారు.సారా తయారీని విడిచి పెట్టిన తయారీ దారులకు ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. బెల్లం సరఫరా దారులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. సారా తాయారు చేసే గ్రామాలను ఎ. కేటగిరీగాను, తాయారీ, పంపిణీ చేసే గ్రామాలను బి. కేటగిరీ గ్రామాలుగాను, సారా వినియోగించే గ్రామాలను సి. కేటగిరీగాను విభజించాలన్నారు. అటువంటి గ్రామాలపై దాడులు చేసి నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. నాటు సారా వినియోగంపై కలిగే నష్టాలను చెడు ప్రభావాన్ని వినియోగదారులకు వివరించాలన్నారు. గ్రామాలలో పూర్తి స్థాయిలో సారా తాయారీ,వినియోగం లేదని అధికారులు చర్చించి సారా రహిత గ్రామంగా ప్రకటించాలని చెప్పారు.సారా తయారీపై 14405 టోల్ ప్రీ
నంబరుకు సమాచారం అందించాలన్నారు.
అనంతరం నవోదయం ప్రచార రథాన్ని ప్రారంభించారు.
జిల్లా ఎస్సీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ గంజాయి మాదిరిగానే నాటు సారా నివారణ చర్యలు చేపట్టాలన్నారు.పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.సారా తయారీ చేసే కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. మహిళా సంఘాల సహకారం తీసుకోవాలని సూచించారు.
ఈ కార్య క్రమంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్. సుజిత్ సింగ్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ పి.నాగ రాహుల్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎల్. రజని. ఎక్సైజ్ ఎన్ ఐలు, పర్చువల్గా రంపచోడవరం వె ఓ కె. సింహచలం, పాడేరు ఐటిడి ఏ ఇన్చార్జి పి ఓ, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, చింతూరు పి. ఓ అపూర్వ భరత్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ జిల్లా పంచాయతీ అధికారి బి. లవరాజు, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి పి. ఎస్. కుమార్, డివిజనల్ ఫారెస్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.