సర్పంచ్ బొబ్బిలి లక్ష్మీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం
On
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 16: ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని రింతాడ పంచాయతీ కేంద్రంలో సర్పంచ్ బొబ్బిలి లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ప్రతి దుకాణం దారుని వద్దకు వెళ్లి ప్లాస్టిక్ కవర్ల నిషేధం గురించి వివరించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం నిషేధం గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ అరుణ్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు బొబ్బిలి వెంకటరావు, వార్డు సభ్యులు, కూటమి నాయకులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.