కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌ పై.. చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు

high-court-orders-for-actions-on-the-kamma-sangam-function

కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌ పై.. చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు


బహుదూర్‌పల్లి మాజీ సర్పంచ్ "సుజాత శ్రీహరి" అభ్యర్ధనపై స్పందించిన హైకోర్టు..

నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కి హైకోర్టు ఆదేశం..

సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌"తో వ్యాపారం..

వివాహాది శుభకార్యాలకు అద్దెల వసూళ్ళపై ఫిబ్రవరి 6న మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కి..

దుండిగల్‌ గండిమైసమ్మ తహశీల్దార్‌‌కి ఫిర్యాదు చేసిన పిటిషనర్ సుజాత..

నిర్లక్ష్యం వహించిన.. రెస్పాండెంట్స్ 2 అండ్ 4 (కలెక్టర్, తహశీల్దార్)..

ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మాజీ సర్పంచ్ "శివునూరి సుజాత శ్రీహరి"..

దుండిగల్‌ మున్సిపల్ కమిషనర్ కమ్మ సంఘం ఫంక్షన్ పరిశీలించాలని.. ఆదేశాలు 

పిటిషనర్ ఆరోపణలు సరైనవని తేలితే 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు..

ప్రభుత్వ భూమిలో "కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ నిర్మించి" వివాహాది శుభకార్యాలకు అద్దెలు వసూళ్ళు చేస్తూ.. వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలతో.. బహుదూర్‌పల్లి మాజీ సర్పంచ్ "శివునూరి సుజాత శ్రీహరి" గత నెల ఫిబ్రవరి 6న మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కి, దుండిగల్‌ గండిమైసమ్మ మండల తహశీల్దార్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదు దారులు సుజాత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ సర్పంచ్ సుజాత అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తాజాగా నాలుగు వారాల గడువు లోపల సంబంధిత అక్రమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న సంబంధిత నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్ దర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

.IMG-20250318-WA0002

 మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, మార్చి 17:

దుండిగల్‌ గండిమైసమ్మ మండలం బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమి 353.35 ఎకరాలు పోరంబోకు స్థలంగా నిర్ధారించి నోటీసులు జారీచేసిన అదే రెవెన్యూ అధికారులు "చిత్ర విచిత్రంగా" వ్యవహరిస్తున్నారు.. ధరణీ రిజిస్ట్రేషన్‌లు, నాలా కన్వర్శన్‌లు..! మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో యధేచ్చగా రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారని.. ప్రభుత్వ (ఎస్‌డిఎఫ్) నిధులతో రూ.60 లక్షల వ్యయంతో కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌కి సీసీరోడ్డు నిర్మిస్తున్నార‌ని..! పలుమార్లు "పెన్ పవర్" దినపత్రికలో వార్తా కథనాలతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి ఆర్డీవో, దుండిగల్‌ తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్ళినా నిర్లక్ష్యం వహించారే కానీ.. చర్యలు తీసుకోలేదు..

 కమ్మ సంఘం ఫిర్యాదుల విషయంలోనూ..

తాజాగా బహుదూర్‌పల్లి మాజీ సర్పంచ్ శివునూరి సుజాత శ్రీహరి ప్రభుత్వ భూమిలో నిర్మించిన కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌పై చర్యలకు ఇచ్చిన, ఫిర్యాదులను కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్, దుండిగల్‌ తహశీల్దార్ బుట్ట దాఖలు చేశారు.. దీంతో మాజీ సర్పంచ్ సుజాత పూర్తి ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించారు.. పిటిషనర్‌ అభ్యర్ధన మేరకు సంబంధిత ఆధారాలు పరిసదీలించి చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది..

IMG-20250318-WA0003


వివరాల్లోకి వెళ్ళితే..
2025లో దాఖలు చేసిన పిటిషన్ డబ్ల్యు.పి నెం. 6976 పై హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్ ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది.. పిటిషనర్ తరపు న్యాయవాది, ప్రతివాది(రెస్పాండెంట్) నెం. 2 అండ్ 4 తరపున రెవెన్యూ విభాగం అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ శ్రీమతి టేకూరు శ్వేత.. 3వ ప్రతివాది తరపున స్టాండింగ్ కౌన్సిల్ పుట్ట కృష్ణారెడ్డి హాజరయ్యారని ఆర్డర్‌లో పేర్కొన్నారు..

 ప్రభుత్వ భూమిలో కమ్మ సంఘం ఫక్షన్ హాల్‌: మాజీ సర్పంచ్ సుజాత..

 

IMG-20250318-WA0004

గండిమైసమ్మ దుండిగల్ మండలం, బహదూర్‌పల్లి గ్రామ శివారు సర్వే నెం. 227 లోని ప్రభుత్వ భూమిలో.. దుండిగల్‌ మున్సిపల్ పరిధిలో ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం ఎలాంటి అనుమతులు లేని, మున్సిపల్ ఇంటిపన్ను కూడా లేని అక్రమ నిర్మాణంతో అద్దెలు వసూళ్ళు చేస్తున్నారని పేర్కొన్నారు.. కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌పై, నిర్వాహకులు అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్‌పై చర్యలు చేపట్టాలని 06.02.2025న ప్రతివాది నెం.2 మేడ్చల్ జిల్లా కలెక్టర్‌.. ప్రతివాది నెం.4 దుండిగల్‌ తహశీల్దార్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ..! సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని..జిల్లా కలెక్టర్, దుండిగల్‌ తహశీల్దార్ నిర్లక్షం వహించారని ఆరోపణలతో పిటిషనర్ హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేసినట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..

IMG-20250318-WA0000

మున్సిపల్ తరపు న్యాయవాది..

పిటిషనర్ మాజీ సర్పంచ్ సుజాత శ్రీహరి సమర్పించిన ఫిర్యాదును దుండిగల్‌ మున్సిపల్ అధికారులు పరిగణలోకి తీసుకుంటారని.. సంబంధిత సైట్‌ను తనిఖీలు చేపట్డి పరిశీలిస్తారని, ప్రతివాది నెం. 3 దుండిగల్‌ మున్సిపల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.. పిటిషనర్ చేసిన ఆరోపణలు రుజువు అయితే..! తెలంగాణ మునిసిపాలిటీ  చట్టం, 2019 కింద నిర్దేశించిన విధానానికి అనుగుణంగా.. ప్రతివాది నెం.5 అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్‌పై ఖచ్చితంగా చర్య తీసుకుంటారని మున్సిపల్ తరపున న్యాయవాది తెలిపారు..

 బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227లో పోరంబోకు స్థలం 353.35 ఎకరాలుగాఎకరాలుగా పేర్కొన్న అధికారులు.. ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను నేటికీ ప్రోత్సహిస్తున్నారు.. నోటీసులు ఇచ్చిన సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుపై నేటికీ తహశీల్దార్ జాలీ చూపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.. ముడుపులు పుచ్చుకుని సహకరిస్తున్నారు కాబోలు అంటూ ఆరోపణలు లేకపోలేదు.. దీనికి తోడు అక్రమ షెడ్డు పక్క నుండే కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌కి ప్రభుత్వ నిధులతో సీసీరోడ్డు నిర్మాణం అధికారుల కనుసన్నల్లోనే పూర్తి చేశారు.. ఇప్పుడు మాజీ సర్పంచ్ అభ్యర్ధన మేరకు హైకోర్టు  జారీచేసిన ఉత్తర్వులు అయినా అమలు చేస్తారా.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలు పాటిస్తారా..? నిర్లక్ష్యం వహిస్తారా..? వేచి చూడాలి.. వేలకోట్లు విలువచేసే 227 ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుకుందాం..

About The Author