చట్టాలు తెలియని వారు చట్టసభల్లోకి వెళ్ళటం దురదృష్టకరం:ఆదివాసీ పార్టీ
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 13 :చట్టాలు తెలియని వారు చట్ట సభలల్లోకి వెళ్ళడం దురదృష్టకరమని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో శాసనాలు తయారు చేసే దేవాలయంతో సమానమైన చట్టసభల్లోకి చట్టాలపై కనీస అవగాహన లేనివారు సభ్యులుగా వెళ్ళడం,వారికి తెలియకుండానే వారి పార్టీ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదవడం పరిపాటిగా మారిందని,గతంలో గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదవానని మీడియా ముఖంగా ఒప్పుకొన్నారు.గిడ్డి ఈశ్వరి లాంటి నాయకురాలే స్క్రిప్ట్ పై ఆధారపడ్డారంటే శిరీష ఏమాత్రమని,స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా శిరీషదేవి మాట్లాడడానికీ ఎందుకు ఎక్కువసార్లు అవకాశం ఇస్తున్నారంటే ఇదే కారణమని, 1/70 భూబదాలయింపు నిషేధచట్టం సవరణ చేయాలని అయ్యన్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఏజెన్సీ బంద్ వరకు ఆదివాసీలు వెళ్తే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సున్నితమైన అంశం వివాదం కాకుండా ఆదివాసీ చట్టాలను రక్షిస్తామని,గౌరవిస్తామని ప్రకటించిన విషయం విదితమే.ఇలాంటి సమయంలో దేవాలయం లాంటి శాసనసభలో అచ్చమైన కోయ ఆదివాసీ ఆడబిడ్డతో ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించే పరిస్థితి ఆదివాసేతరులు తీసుకొచ్చారు.పాపం శిరీషదేవికే కాదు చాలా మందికి తెలియని విషయం భూబదాలయింపు నిషేధచట్టం (ఎల్టీఆర్ చట్టం)14 ఆగస్టు 1917 న 1/17 భూబదాలయింపు నిషేధచట్టం బ్రిటిష్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,స్వాతంత్ర్యం అనంతరం భారత్ ప్రభుత్వం 04 ఏప్రిల్ 1959 న 1/59 భూబదాలయింపు నిషేధచట్టం మరియు 22 డిసెంబర్ 1970 న 1/70 భూబదాలయింపు నిషేధ చట్టం తీసుకొని రావడం జరిగిందని, నాన్ ట్రైబల్స్ వారి అతి తెలివి తేటలతో 1952సం.కు ముందు నుండి ఏజెన్సీలో ఉంటున్న నాన్ ట్రైబల్స్ కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే శిరీషదేవితో శాసన సభలో మాట్లాడించడం జరిగింది,కానీ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎల్టీఆర్ చట్టం 1917 నుండే ఉందని, ప్రభుత్వం కూడా గిరిజనేతరులతో సమానమని సమత జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టు చెప్పిన విషయం కూడా గుర్తు పెట్టుకోవాలని,ఆదివాసీలకు ప్రధానంగా వారు ఎన్నుకున్నా ప్రతినిధులు చాలా ప్రమాదం పొంచి ఉందని,గతంలో గిరిజనేతరులకు ఒకటిన్నర సెంట్ల భూమిని ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏడుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ వ్రాయడం జరిగింది.మొన్నటికి మొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రత్యేక ఉప కలెక్టర్ (గిరిజన సంక్షేమం)రద్దు చేయించినట్లు మాట్లాడారు,రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి గిరిజనేతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వమనడం, రేపు ఏ ఎమ్మెల్యే ఏమి మాట్లాడుతారోనని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు,కానీ చట్టపరంగా గిరిజనేతరులకు సూది మేపేంత స్థలం కూడా షెడ్యూల్డ్ ప్రాంతంలో లేదన్న విషయం ఆదివాసీ ప్రజాప్రతినిధులు,ఆదివాసీలు,పాలకులు,గిరిజనేతరులు,ఏజెన్సీలో పని చేసే ఉద్యోగులు తెలుసుకోవాలని ఆయన అన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.