గృహ లబ్ధిదారులకు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు: గృహ నిర్మాణ శాఖ ఏఈ సెగ్గే సూరిబాబు

SAVE_20240719_151639
సమీక్షా సమావేశంలో హౌసింగ్ ఏఈ సెగ్గే సూరిబాబు

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టాలి  

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై18:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లతో గృహ నిర్మాణ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల కొరకు గృహ నిర్మాణ శాఖ ఏఈ సేగ్గే సూరిబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.గృహ నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకంలో 90 రోజుల పని దినాలు జనరేట్ చేయాలని తెలిపారు.గృహ నిర్మాణ లబ్ధిదారుల జాబితాను ఫీల్డ్ అసిస్టెంట్ కు అందించారు. గృహ నిర్మాణంలో బేస్మెంట్ లెవెల్ కు 50 రోజులు,రూప్ లెవెల్ కు 40 రోజులు పని దినలకు మస్టర్ వెయ్యాలని సూచించారు.అలాగే మండలంలో ఐహెచ్ హెచ్ ఎల్ ఎస్ మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా చూడాలని సూచించారు.మరుగుదొడ్లు నిర్మించిన లబ్ధిదారులకు బిల్స్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.కావున గృహ లబ్ధిదారులందరూ ఎంజిఎన్ఆర్ఇజిఎస్,ఐహెచ్.హెచ్ఎల్ఎస్ నిధులను వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో అప్పలరాజు, గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్లు కే గిరీష్, పి చిట్టి పడాల్, కంప్యూటర్ ఆపరేటర్ అర్జున్,సచివాలయం సిబ్బంది, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.