పాడేరు నియోజకవర్గం లో కార్యకర్తలను పట్టించుకునే నాధుడు లేడు:వైయస్సార్సీపి మండల అధ్యక్షుడు మోరి రవి
👉🏻వైయస్సార్సీపి కార్యకర్తలను విస్మరించడం సరికాదు
👉🏻నాయకుల ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీవ్ర నష్టం
చింతపల్లి పెన్ పవర్ మార్చి 13:- పాడేరు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు నేడుకార్యకర్తలను విస్మరించడం సరికాదని, కొందరి ముఖ్య నాయకుల ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చింతపల్లి వైకాపా మండల అధ్యక్షుడు మోరి రవి అన్నారు. గురువారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమని, 15 సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలుతెలియజేస్తున్నానన్నారు.దివంగతముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిచేసినసంక్షేమ పాలనకుఆకర్షితులైఅనేకమంది ఆయనకు అభిమానులు అయ్యారని అందులో తాను ఒకడినని అన్నారు. అలాంటి మహానాయకుడిమరణాంతరం తన రాజకీయ వారసుడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పేరిట 2011 మార్చి 12న స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాలా రాష్ట్రంలోనే గాక మన్యంలో కూడా అనేకమంది అభిమానులు అయ్యామన్నారు. నాటినుండి నేటి వరకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సూచనలతోనే పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అందుకు తగ్గట్టుగానే మన్యంలో పాడేరు, అరకు నియోజకవర్గాలలో మూడుసార్లు వైకాపాను అఖండ మెజారిటీతో గెలిపించుకోగలిగామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలే కాకుండా పంచాయతీ స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీలను, ఎంపీపీ, జడ్పీటీసీలను 80 శాతంగెలిపించుకోగలిగామన్నారు. ఈ విజయాల వెనక ఎందరో కార్యకర్తల శ్రమ, కృషి ఉందన్నారు. కానీ నేడు జిల్లా నాయకత్వం కార్యకర్తలను విస్మరించి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాడేరు నియోజకవర్గంలోకార్యకర్తలను పట్టించుకున్న నాధుడు కరువవ్వడం బాధాకరమన్నారు. 2019, 2024 ఎన్నికలలో వైకాపా అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటికి తిరిగి అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను విస్మరించడందురదృష్టకరమన్నారు. ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.ఇప్పటివరకు నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి నియోజకవర్గ లేదా జిల్లా స్థాయి సమావేశాలు ఒక్కటి కూడా నిర్వహించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. పాడేరు నియోజకవర్గంలో వైకాపాకు మెజారిటీ ఓటర్లు కలిగిన జికే వీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో వైకాపా జిల్లా ఇన్చార్జ్, పాడేరు శాసనసభ్యులు ఇప్పటివరకు ఆయా మండలాల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. జిల్లా ఇన్చార్జ్, తమ శాసనసభ్యులు తమ మండలాలకు రావాలంటే ఏ ఇంట్లోనైనా శుభకార్యమో లేదా ఫంక్షను, లేదా అశుభ కార్యక్రమమో జరిగితే తప్ప రాలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. ఏనాడైనా ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమై ఆత్మీయంగా పలకరించారా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తల మనోభావాలు వారికి ఎలా అర్థమవుతాయని ప్రశ్నించారు. ఇది తన ఒక్కడి భావనే కాదని ఆయా మండలాల్లో ఉన్న ప్రతి కార్యకర్త మనోవేదనని అన్నారు. ఎందరో కార్యకర్తలు కడుపేదరికంలో ఉంటూ ఎటువంటి పదవులకు ఆశించకుండా పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్న వారిని పట్టించుకోకపోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు సమన్వయకర్తగా ఉన్నప్పుడు అలాగే టికెట్ ఇచ్చినప్పుడు ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఏ క్షణంలో ఫోన్ చేసిన తక్షణమే స్పందించి మీ ముందు వాలిపోతానని హామీలు ఇచ్చి నేడు కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఆయనలోని నాయకత్వ లోపానికి నిదర్శనమన్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. నియోజకవర్గంలో గిరిజన ప్రజలు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని, వైకాపా పార్టీ గుర్తును చూసి మాత్రమే ఓటు వేశారని, అభ్యర్థులను చూసి కాదని గుర్తుంచుకోవాలని అన్నారు. కార్యకర్తలుగా తమ జండా ఎజెండా ఒకటేనని అది వైకాపా జెండాను తమ భుజాలపై మోయడమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా జిల్లా ముఖ్య నాయకులు గాని, పార్టీ అధిష్టానం గానీ పదవులు ఆశించని కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించి వారి అవసరాలను తీర్చాలని కోరారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని, నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తలదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ మన ప్రభుత్వమొస్తుందని, మనందరికీ మేలు జరుగుతుందని, కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు

.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.