ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కు 75ఫిర్యాదులు 

1001126734
మీకోసం కార్యక్రమంలో...

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై26: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరములో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ “మీకోసం” కార్యక్రమము (పబ్లిక్ గ్రీవన్సు రీడ్రస్సల్ సిస్టం) నిర్వహించడమైనది. ఈ కార్యక్రమమునకు వివిధ మండలాలు నుండి అర్జీదారులు హాజరవడమైనది. ఈ మీకోసం కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్, జిల్లా రెవిన్యూ అధికారి బి.పద్మావతి ఆధ్వర్యములో నిర్వహించడమైనది.మీ కోసం కార్యక్రమానికి ఈ వారం 75 దరఖాస్తులు రాగా అందులో కొన్ని ఈ క్రింద పొందుపర్చడమైనది.

ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ,గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వర్షం సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పాడుపడిన భవనములు,చెట్ల కింద ఉండరాదని విజ్ఞప్తి చేసారు.గాలికి చెట్లు,విధ్యుత్ స్తంభాలు విరిగిపడే అవకాశం ఉన్నందున అనవసరంగా బయటకు రాకడదని సూచించారు.ఇందులో భాగంగా జి. మాడుగుల మండలం గేమ్మిలి పంచాయతి, కొలుంబొర్ర, మహాదేవపురం గ్రామము నుండి ఎం.రామచంద్ర పాత్రుడు తన బంజరు భూమి పది సెంట్లును చదును చేసుకొని వ్యవసాయం చేసుకుంతున్నప్పటికీ, ఆ భూమిని చింతపల్లి మండలం బెన్నవరం గ్రామపంచాయతి, బెన్నవరం గ్రామస్తుడు ఉల్లి జయరావు దౌర్జన్యం చేసి తీసుకున్నారని, న్యాయం చేయమని అర్జీ పెట్టుకున్నారు.  

చింతపల్లి మండలం,చింతపల్లి గ్రామము కాగి వెంకయ్యమ్మ ఆమె ఇంటి స్థలంలో వీరపు నాన్ ట్రైబల్ ఇల్లు నిర్మించుకున్నారుని,అడిగితే హేళనగా మాట్లాడుతున్నారని ఈ విషయమై మండల కార్యాలయమునకు పలుమార్లు వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని,ఆ ఇంటిని తొలగించి స్థలము ఇప్పించాలని, దరఖాస్తు చేసారు.అరకువేలి మండలం పెదలబుడు గ్రామ పంచాయతి తాంగులగుడ గ్రామం కిల్లో గోవర్దన్ వ్యవసాయ బోరు వేయించు కొని విద్యుత్ సరఫరా కొరకు అర్జీ చేసుకున్నప్పటికీ కనెక్షన్ ఇవ్వలేదని,త్వరగా ఇప్పించాలని దరఖాస్తు చేసారు.అరకువేలి మండలం మడగడ పంచాయతి, గంగగుడ్డి గ్రామస్తులు వి.సింగ్, వి. పిల్కు రేషన్ కార్డు మంజూరు కోసం అర్జీ పెట్టుకున్నారు.అరకువేలి మండలం మడగడ పంచాయతి, వంతమూరు గ్రామస్తులు కె. శంకరావు, కె. భగవాన్, కె. సింహాద్రి,కే. రఘునాథ్ త్రాగునీరు సమస్య పరిష్కారము కొరకు దరఖాస్తు చేసుకున్నారు.చింతపల్లి మండలం, చౌడుపల్లి గ్రామ పంచాయతి గ్రామస్తులు వి. రాము నాయుడు,పాంగి రాజారావు, జి.రాము, వి.గురుమూర్తి, కిల్లో గంగాధర్ చెక్ డాం మంజూరు గురించి దరఖాస్తు చేసుకున్నారు.  

హుకుంపేట మండలం, అడ్డుమండ గ్రామ పంచాయతి నుండి డి. దేముడమ్మ తుఫాన్ కారణంగా తను ఇల్లు కోల్పోయిందని, నష్టపరిహారం ఇప్పించమని అర్జీ పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎపిఒలు ప్రభాకర రావు,వెంకటేశ్వర రావు, డిడి, ట్రైబల్ వెల్ఫేర్ ఐ. కొండల రావు,జిల్లా మత్స్య శాఖాధికారి పి. శ్రీనివాస రావు,జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారి ఎన్. సూర్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఎ.రమేష్ కుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి టి.సుజాత, జిల్లా రవాణా శాఖాధికారి ఎస్. లీలా ప్రసాద్, ఆర్టిసి డిఎం వి. శ్రీనివాసరావు, డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.మురళి, ఫుడ్ సేఫ్టీ అధికారి బి.వేణుగోపాల్, ఇఇ ట్రైబల్ వెల్ఫేర్ డివిఆర్ఎం రాజు, జిల్లా గనులు మరియు భూగర్భ శాఖాధికారి ఎస్.పి.కే.మల్లేశ్వర రావు,ఇఇ,ఎపిఇపిడిసిఎల్ ఏవిఎన్ఎం. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.