పెన్ పవర్ విలేకరిని పరామర్శించిన సంకాడ సర్పంచ్, వైస్ ఎంపీపీ
On
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఫిబ్రవరి 20:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెన్ పవర్ విలేఖరి మాదిరి చంటిబాబును సంకాడ సర్పంచ్ దేశగిరి నాగులమ్మ, వైస్ ఎంపీపీ లోతా దేవుడు గురువారం ఉదయం చంటిబాబు స్వగ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొంది ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న విలేకరిని పరామర్శించి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విలేఖరికి వారికి తోచిన ఆర్థిక సహాయాన్ని అందించారు. తనను పరామర్శించడానికి వచ్చినందుకు చంటిబాబు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.