మోడీకి షాకిచ్చిన కశ్మీరం...  

kashmir-shocked-modi- 

మోడీకి షాకిచ్చిన కశ్మీరం...  

వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్న సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో, ఇవాళ జమ్మూకశ్మీర్‌ ఎలక్షన్స్‌ ఫలితాలు చూస్తే ఇదే స్పష్టం అవుతుంది. 500 ఏళ్ల హిందువుల కల అయోధ్య రామ మందిర నిర్మాణంచేపట్టినా, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా బీజేపీకి చేదు ఫలితం ఎదురైంది..

రామ మందిరాన్ని కట్టించి హిందువుల చిరకాల కోరికను నిజంj&k result చేసి చూపించారు ప్రధాని మోదీ. అవాంతరాలు, అడ్డంకులు..కోర్టు కేసులు..వివాదాలు అన్నీ ఒక్కొటిగా దాటుకునిభవ్యరామ మందిరం నిర్మాణం పూర్తి చేశారు. రాముడి ప్రతిష్ఠ జరిపారు. దేశమంతా హ్యాపీ అనుకున్నారు. ఇది చూసిన హిందువులు, బీజేపీ ఇంకా హ్యాపీ. రాముడికి ఇన్నాళ్లకు ఓ నీడ దొరికిందని సంతోష పడ్డారు. రామ మందిరం నిర్మాణం పూర్తి చేశామన్న ఉత్సాహంతో లోక్‌ సభ ఎన్నికలకు దిగిన బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. అయోధ్య అసెంబ్లీ ఉన్న ఫైజాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గాన్ని ఇండీ కూటమిలోని సమాజ్‌ వాదీ పార్టీ గెలుచుకుంది. అంటే ఇన్నేళ్ల కలను తీర్చిన అయోధ్య ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్లు బీజేపీని తిరస్కరించారని అర్థం. ఇది ఊహించని షాక్‌ బీజేపికి అని చెప్పవచ్చు.తాజాగా రెండో షాక్‌ తగిలింది. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ ను పూర్తిగా భారత్‌ చట్టాల పరిధిలోకి తీసుకువచ్చింది బీజేపీ ప్రభుత్వం. దీని కోసం ఎన్నో ఏళ్లుగా వ్యూహం పన్నింది. అస్సలు బీజేపీ ఐడియాలజీకి సరిపోని మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకుని గెలిచింది. తర్వాత మద్దతు ఉపసంహరించుకుని మోదీ, అమిత్‌ షా రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. రాజకీయ వ్యూహాలతో కశ్మీర్లోని పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసి వేర్పాటువాద శక్తులు సైతం బిత్తరపోయేలా ఆర్టికల్‌ 370 రద్దు చేశారు. ఫలితంగా కశ్మీర్‌ రాష్ట్రం హోదా కోల్పోయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్ము కశ్మీర్‌ , లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త ప్రయాణం మొదలు పెట్టాయి.  తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జనరల్‌ గా పాకిస్థాన్‌ కబంధ హస్తాల్లోనూ..వేర్పాటు వాద శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్న కశ్మీర్‌ ను పూర్తిగా మన చేతుల్లోకి తెచ్చుకునేలా..పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కూడామాదే అని పార్లమెంటులో గర్జించిన అమిత్‌ షా కామెంట్స్‌ కు దేశభక్తి తో ఉప్పొంగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలి కదా. అందుకే ఈసారి పీడీపీతో కూడా పనిలేకుండా సింగిల్‌గా బరిలోకి దిగింది. కానీ ఈరోజు వచ్చిన రిజల్ట్‌ బీజేపీకి షాక్‌ ఇచ్చింది.అబ్దుల్లాల పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తో జత కట్టిన కాంగ్రెస్‌ కశ్మీర్‌ లో హవా చూపించింది. ఈక్వేషన్‌ సింపుల్‌. ఫైట్‌ ఏదైనా కానీ ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేదే చూస్తారు. మన దేశంలో జాతీయ స్థాయిలో రెండే ప్రధాన అధికార కేంద్రాలు. ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్‌. పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న మోదీ గద్దె దింపాలని ఈ కాంగ్రెస్‌ దేశంలోనే చాలా విపక్షాలు ఏకం చేసి ఇండీ కూటమిగా ఏర్పడ్డాయి. భారత్‌ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ రాహుల్‌ గాంధీ నడిచారు. శ్రీనగర్‌ లో మంచులోతడుస్తూ యాత్రను ముగించే ప్రసంగం చేశారు కూడా. ఆ తర్వాత జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి ఊహించనంత పోటీ ఇచ్చింది కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండీ కూటమి. సొంతంగా 99 ఎంపీ స్థానాలు గెలుచుకుని బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించటమే కాదు..పార్లమెంటులో బీజేపీ ఆటలు సాగే అవకాశం లేనంత పెద్దశక్తిగా నిలబడిరది.కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే..బీజేపీ అనే పార్టీ ఏర్పాటుకు కొన్ని సిద్ధాంతాలు చాలా మూలం. వాటి సాధన కోసమే భారతీయ జనతా పార్టీ ఏర్పడిరది. ఇక
జమ్మూకాశ్మీర్‌ విషయంలో బీజేపీ పరిపాలనను ఎండగట్టాయి కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌. ఈ రెండు పార్జీలు కలిసి మేజిక్‌ ఫిగర్‌ను దాటేశాయి. గడిచిన పదేళ్లుగా జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.ఢల్లీి విషయానికొద్దాం.. బీజేపీ వ్యూహాలను గమనించారు ఆఫ్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌. లిక్కర్‌ స్కామ్‌లో బెయిల్‌పై విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీపై మహిళను కూర్చొబెట్టారు. దీంతో ఢల్లీి ఓటర్లలో ఆ పార్టీ మరింత ఇమేజ్‌ పెరిగింది. బలమైన పోటీ ఇవ్వాలని భావించారు కమలనాథులు. కేజ్రీవాల్‌ ఎత్తులకు బీజేపీ చిత్తయ్యిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్‌తో కలిసి ఆప్‌ పోటీ చేస్తే హస్తిన పీఠం బీజేపీ అందుకోవడం కష్టమేనని అంటున్నారు.ఉత్తరాదిలో ప్రజలు రిజక్ట్‌ చేస్తే కష్టమనే అభిప్రాయం అప్పుడే కమలనాథుల్లో మొదలైంది. గడిచిన పదేళ్లు మోదీ హవా విూద గెలిచామని చెప్పుకుంటూ కాలం గడిపేశారు కీలక నేతలు. రాష్ట్రాల ఫలితాలతో ఒక్కసారిగా
ఖంగుతిన్నారు నేతలు.ఇక బీజేపీలో మోదీ శకం ముగిసినట్టేనన్న వాదన ఓ వర్గంలో మొదలైంది. పరిస్థితి జఠిలం కాకముందే మేల్కొంటే మంచిందని, లేకుంటే కష్టమని అంటున్నారు. ఈ క్రమంలో జమిలి ఎన్నికలకు తెరపైకి తెచ్చిందని అంటున్నారు. ఈ ఫలితాలతో కమలనాథుల్లో కనువిప్పు కలిగేనా? వ్యక్తి పూజ కంటిన్యూ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలాల్చివుంది.ఇద్దరు ఎంపీలతో ప్రస్థానాన్ని ప్రారంభించి దేశంలో ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అలాంటి కీలక సిద్ధాంతాల్లో రెండోదైన అయోధ్య రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 లాంటి వి రద్దు చేసినా..ప్రధానంగా ఆ ప్రభావం కనిపించాల్సిన రెండు ప్రాంతాల్లోనూ బీజేపీ ఓటమి అనేది రాహుల్‌ గాంధీ విజయంగా..తనను తగ్గించుకునైనా సరే అక్కడ ఎవరిని పెట్టాలో వాళ్లని పెట్టి..ఎవరితో చేతులు కలపాలో వాళ్లతో చేతులు కలిపి మోదీ, అమిత్‌ షా లాంటి వాళ్లకే షాక్‌ ఇచ్చిన రాజకీయ వ్యూహంగా చూడాలా. లేదా రెండు ఏదో కాకతాళీయంగా ఓడిపోయింది బ్యాడ్‌ లక్‌ అనుకోవాలా..

About The Author